Begin typing your search above and press return to search.

అందాల తార కూతురు అదరగొట్టేస్తోంది

By:  Tupaki Desk   |   13 May 2016 1:30 PM GMT
అందాల తార కూతురు అదరగొట్టేస్తోంది
X

సినీ పరిశ్రమలో అందగత్తెలకు కొదువ లేదు. కానీ అందాల తార అన్న మాట శ్రీదేవికి మాత్రమే సొంతం. అంతగా దేశంలోని సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి.. ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. మరోవైపు తన వారసురాలి అరంగేట్రం కూడా శ్రీదేవి ప్రయత్నాలు ప్రారంభించిందనే టాక్ వినిపిస్తోంది. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇప్పుడు హీరోయిన్ అయేందుకు సిద్ధంగా ఉంది. అమ్మ కంట్రోల్ చేస్తోంది కానీ.. లేకపోతే ఈ చిన్నది ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసేది. అలాగని సినిమాలపై తన కోరికను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోవడం లేదు ఈ భామ.

గ్లామర్ విషయంలో అమ్మతో పోటీ పడలేకపోయినా.. అందాల ప్రదర్శనతో మాత్రం ఆన్ లైన్ జనాలను నెట్ లో పడేస్తోంది ఈ సొగసరి. రీసెంట్ గా తల్లి నటిస్తున్న మూవీ 'మామ్' షూటింగ్ కోసం జార్జియా వెళ్లి జాహ్నవి.. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇలా అమ్మడు ఎంజాయ్ చేసిందో లేదో.. ఆ ఫోటోలన్నీ ఆన్ లైన్ లోకి వచ్చేశాయి. ఇదొక్కటే కాదు.. జాహ్నవి ఏం చేసినా సోషల్ సైట్లలో ఫోటోలతో సహా పోస్ట్ చేసేస్తుంది.

ఈ చిన్నదాన్ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా అరంగేట్రం చేయించాలని కరణ్ జోహార్ ప్రయత్నాలు పెంచేశాడు. ఇప్పటివరకూ శ్రీదేవి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఇంకా చదువుకోవాలని చెబుతోంది. అయితే.. ఈ మధ్య శ్రీదేవి దగ్గరకు కాకుండా.. ఇండివిడ్యువల్ గా జాహ్నవి చెంతకే ఆఫర్స్ వెళుతున్నాయట. దీంతో కంగారు పడ్డ మాజీ అందాల తార.. తన వారసురాలిని కంగారుపడద్దని చెబుతోందిట.