Begin typing your search above and press return to search.

అప్పుడే డేటింగులా జాన్వి??

By:  Tupaki Desk   |   30 May 2017 8:16 AM GMT
అప్పుడే డేటింగులా జాన్వి??
X
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు పెద్ద కుమార్తె జాన్వి కపూర్ మరోసారి తెర ముందుకొచ్చి వార్తల్లోకొచ్చింది. ఒక గ్లామర్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని ఫీచర్లూ పుష్కలంగా ఉన్న జాన్వి ఎప్పుడు సినిమాల్లోకి రంగప్రవేశం చేస్తుందా అని బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జాన్వి సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందనేది ఆమె తల్లి శ్రీదేవి అఫీషియల్ గా చెప్పకపోయినా హీరోయిన్ గా నటిస్తుందని చెప్పేసింది. అందుకే జాన్వి అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి కెమెరాల కళ్లు ఆమెను ఫాలో అయిపోతుంటాయి.

తాజాగా జాన్వి హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ తో కలిసి మూవీ డేట్ కు వెళ్లింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ డెబట్ ఫిలిం బేవాచ్ సినిమా స్ర్కీనింగ్ కు ఇషాన్ తో కలిసి ఒకే కారులో వెళ్లింది. జాన్వి కారు వెనుక సీట్ లో కూర్చుని ఉండగా ఇషాన్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఆమెను థియేటర్ కు తీసుకెళ్లాడు. జాన్వికి దూరంగా ఉండాలని షాహిద్ కపూర్ వార్నింగ్ ఇచ్చినా దానిని పక్కనపెట్టి మరీ ఆమెతో కలిసి సినిమాకి వెళ్లాడని బాలీవుడ్ టాక్. ఆ లెక్కన చూస్తే వీరిద్ధరి మధ్య రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉందనే అనుకోవాలి. బేసిగ్గా ఇషాన్ బాలీవుడ్ హఢావుడికి కాస్త దూరంగానే ఉంటాడు. ఇదిగో ఇలా శ్రీదేవి కూతురితో కలిసి సినిమాకు రావడంతోనే ఒక్కసారిగా హైలైట్ అయిపోయాడు. మొత్తానికి ఇంకా స్టార్లెట్ కాకముందే జాన్వి డేటింగులు చేసేస్తోంది అనమాట.

బేవాచ్ చూసేందుకు సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన జాన్వి మార్వలెస్ గా కనిపించింది. క్యాజువల్ డ్రస్ లో వచ్చినా అందరి చూపులను ఇట్టే పట్టేసింది. అందుకే అక్కడ బేవాచ్ లో ప్రియాంక అందాలను తిలకించేందుకు వచ్చిన కళ్లన్నీ జాన్వి వైపు షిఫ్టయిపోయాయి. బేవాచ్ సినిమా మన దేశంలో జూన్ 2న థియేటర్లలోకి రాబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/