Begin typing your search above and press return to search.

అమెరికా ప్రజలు.. తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ఒక్కటేనన్న ఝాన్సీ

By:  Tupaki Desk   |   6 Nov 2019 9:35 AM GMT
అమెరికా ప్రజలు.. తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ఒక్కటేనన్న ఝాన్సీ
X
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 ముగిసింది. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. రాహుల్‌ పై మొదటి నుండి కూడా సోషల్‌ మీడియాలో కొందరు ట్రోల్స్‌ చేస్తూ ఉండగా మరికొందరు ఆయనకు మద్దతుగా క్యాంపెయిన్‌ చేశారు. ఎక్కువ శాతం బుల్లి తెర సెలబ్రెటీలు శ్రీముఖికి మద్దతుగా నిలిచారు. కాని పైనల్‌ లో ప్రేక్షకులు ఏ కారణం చూశారో కాని రాహుల్‌ ను విజేతగా నిలబెట్టారు. ప్రేక్షకుల నిర్ణయం మేరకు రాహుల్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ట్రోఫీని దక్కించుకున్నాడు అంటూ హోస్ట్‌ నాగార్జున ప్రకటించి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందజేయించారు.

రాహుల్‌ విజేతగా అయిన తర్వాత కూడా పలువురు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. రన్నర్‌ గా నిలిచినా కూడా శ్రీముఖికి విన్నర్‌ స్థాయిలో వెల్‌ కమ్‌ దక్కింది. ఇక పలువురు సోషల్‌ మీడియా ద్వారా శ్రీముఖి కూడా విన్నర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలోనే యాంకర్‌ ఝాన్సీ కూడా శ్రీముఖికి మద్దతుగా ఒక పోస్ట్‌ పెట్టింది. ఆమె పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదే సమయంలో ఆమెపై రాహుల్‌ అభిమానులు ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఝాన్సీ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ... అమెరికా లాంటి దేశమే మహిళ అధ్యక్షురాలికి సిద్దంగా లేనప్పుడు తెలుగు ప్రేక్షకులు మాత్రం మహిళ బిగ్‌ బాస్‌ విన్నర్‌ కు ఏం సిద్దంగా ఉంటారు అంటూ శ్రీముఖి నీవు నీ బెస్ట్‌ ఇచ్చావు అంటూ ప్రశంసిస్తూ మహిళల పట్ల చూపుతున్న చిన్న చూపుకు ఆమె అసహనం వ్యక్తం చేసింది.

గతంలో ఇండియాలో పలు బిగ్‌ బాస్‌ సీజన్స్‌ లో మహిళలు విన్నర్స్‌ గా నిలిచారు. శ్రీముఖి కంటే రాహుల్‌ బెటర్‌ అని జనాలు అనుకున్నారు కనుక ఆమె రన్నర్‌ గా నిలిచి రాహుల్‌ విన్నర్‌ అయ్యాడని.. ఈ విషయానికి మహిళా సాధికారత వరకు వెళ్లడం ఏంటీ.. మహిళలను చిన్న చూపు చూస్తున్నారంటూ కామెంట్స్‌ చేయడం ఏంటీ మేడం అంటూ ఝాన్సీని రాహుల్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోండి అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో ఝాన్సీ తలదూర్చి ట్రోల్స్‌ కు గురవుతోంది.