Begin typing your search above and press return to search.

రజనీతో చైనీస్ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   29 Dec 2015 1:01 PM IST
రజనీతో చైనీస్ సూపర్ స్టార్
X
బాలీవుడ్ సినిమాల్లో దక్షిణాది తారలు, దక్షిణాది సినిమాల్లో బాలీవుడ్ బాబులు కనపడటం విశేషంగా మొదలయ్యి రొటీన్ రోజులుగా మారిపోతున్న తరుణంలో హాలీవుడ్ నటుణ్ణి తీసుకొచ్చి షాకిచ్చారు తమిళ దర్శకుడు శంకర్. ఆ నమ్మకంతోనే రోబో2లో రజనీని ఢీ కొట్టనుంది ఈ కండలవీరుడే అనుకున్నంతలోనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశాడు ఆర్నాల్డ్. అలా ఆర్నాల్డ్ ఔట్ అయ్యాక అతడి ప్లేస్ లోకి ఇప్పుడు మరో సూపర్ స్టార్ వచ్చి చేరాడు. అతనొచ్చింది రోబో2 సినిమాకోసం కాదు. విషయానికొస్తే...

తమిళ యువ దర్శకుడు పి.ఎ.రంజిత్ తో కబాలి సినిమా చేస్తున్నారు తలైవా. మాఫియా డాన్ గా రజనీ కనపడనున్న ఈ సినిమాలో అతడికి పోటీగా చైనీస్ సూపర్ స్టార్ జెట్ లీ నటించనున్నారట. మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడైన ఇతగాడు ది ఎక్స్పాండబుల్స్ సిరీస్ సహా మరికొన్ని సినిమాల్లో నటించారు. హాలీవుడ్ తారలంటే పారితోషికం సైతం ఆ రేంజ్ లోనే ఉంటుంది మరి. అందుకు అగ్ర చిత్రాల నిర్మాత కలైపులి ఎస్.థాను అభ్యంతరం చెప్పకుండా దర్శకుడి సూచనకి ఎస్ చెప్పేశారట. ఇదంతా చూస్తుంటే.. తలైవా హాలీవుడ్ తాట తియ్యాలని డిసైడ్ అయినట్టులేదూ...!

సూపర్ స్టార్ రజనీకాంత్