Begin typing your search above and press return to search.
'జెర్సీ' థర్డ్ సింగిల్ వచ్చేసింది
By: Tupaki Desk | 15 Dec 2021 4:00 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి` రీమేక ఆధారంగా రూపొందించిన `కబీర్ సింగ్` చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. ఈ మూవీ అందించిన సక్సెస్‌తో భారీ పారితోషికాన్ని శాసించే స్థాయికి ఎదిగిన షాహీద్ ఇదే ఊపులో మరో రీమేక్ ని చేస్తున్న విషయం తెలిసిందే. షాహీద్ నటిస్తున్న మరో తెలుగు క్రేజీ రీమేక్ `జెర్సీ`. తెలుగు `జెర్సీ`ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ ద్వారా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ , దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లపై దిల్ రాజు, సూర్య దేవర నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మృణాల్ ఠాకూర్, పంకజ్‌కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకుంది. అదే స్థాయిలో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ `మమెరమ్...` సెకండ్ సింగిల్ `మైయ్యా.. మైనూ...` చార్ట్‌బస్టర్స్ గా సూపర్ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థర్డ్ సింగిల్ వీడియోని మేకర్స్ బుధవారం విడుదల చేశారు. `బలియేరే..` అంటూ సాగే ఈ పాటలో షాహీద్ క్రికెట్ ఘట్టాలతో పాటు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తో చేసే రొమాంటిక్ సన్నివేశాలని, వీరిద్దరి మధ్య సాగే ప్రధాన లవ్ ట్రాక్ ని చూపిస్తూనే క్రికెటర్ గా షాహీద్ పాత్ర ఎదిగిన తీరుని చూపించారు.
ఈ పాటకు సంబంధించిన వీడియో లింక్, పోస్టర్ ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన హీరో షాహీద్ దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ ని జత చేశారు. సినిమాలో ఈ పాట నన్ను ముందుకు నడిపించింది. మా సినిమాలోని నెక్స్ట్ సాంగ్ `బలియేరే..` డిసెంబర్ 31న జెర్సీ థియేటర్లలో విడుదల కాబోతోంది` అని ట్వీట్ చేశారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి.