Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో సత్తా చూపుతున్న నాని!

By:  Tupaki Desk   |   21 April 2019 11:27 AM IST
ఓవర్సీస్ లో సత్తా చూపుతున్న నాని!
X
న్యాచురల్ స్టార్ నానికి తెలుగు రాష్ట్రల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ ఫాలోయింగే ఉంది.. ఓవర్సీస్ అంతా కాకపోయినా అమెరికాలో మాత్రం నాని సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. నాని ఎంచుకునే డిఫరెంట్ సబ్జెక్టులు అక్కడివారికి డీప్ గానే కనెక్ట్ అవుతాయి. తాజాగా 'జెర్సీ' తో మరోసారి అమెరికా ప్రేక్షకులను మెప్పించాడు నాని. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని-శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' ఎన్నారైలను క్లీన్ బౌల్డ్ చేసింది.

శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకే(అమెరికా టైమ్) 'జెర్సీ' హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. గురువారం నాడు ప్రిమియర్ల ద్వారానే 'జెర్సీ' $145K కలెక్షన్ వసూలు చేసింది. శుక్రవారం నాడు $260K పైగా కొల్లగొట్టింది. ఇక శనివారం నాడు వివరాలు అందే సమయానికి $107K వసూలు చేసి హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటేసింది. సూపర్బ్ టాక్ తో దూసుకుపోతోంది కాబట్టి ఈ వీకెండ్ లోనే వన్ మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది.

నాని కెరీర్ లో ఇప్పటివరకూ ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'( $1.4 మిలియన్). 'జెర్సీ'కి వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తుంటే ఆ రికార్డు ను బ్రేక్ చేసి నాని కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.