Begin typing your search above and press return to search.

`జెర్సీ` కథ మొత్తం లీక్

By:  Tupaki Desk   |   9 April 2019 4:49 AM GMT
`జెర్సీ` కథ మొత్తం లీక్
X
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన `జెర్సీ` ఏప్రిల్ 19న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ పదిరోజులు వరుస ప్రమోషన్స్ తో హీటెక్కిస్తామని నాని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన మీడియా మీట్ లో తెలిపారు. అసలు జెర్సీ అంటే ఏంటి? జర్సీ కథేమిటి? అని ప్రశ్నిస్తే నాని ఎలాంటి దాపరికం లేకుండా కథ గురించి వివరించారు.

జెర్సీ అంటే ఆటగాడి దుస్తులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైటిల్ నే ఎందుకని పెట్టుకున్నామో తెరపైనే చూడండి అని అన్నారు నాని. అయితే ఈ సినిమా ఆద్యంతం అర్జున్ అనే క్రికెటర్ కోణంలో ఉంటుంది. లేటు వయసులో అతడు సాధించే విజయం ఏమిటి? ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ ఏంటి? అన్నది తెరపై చూడండి అన్నారు. ఇందులో హైదరాబాద్ ప్లేయ‌ర్‌గా అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేస్తాడు అర్జున్. 1986- 1996- 2018 కాలం లో కథ జరుగుతుంది... అని కథ గుట్టును లీక్ చేశారు. నేనే క్రికెటర్ అని నమ్మించగలిగేలా అర్జున్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర డిజైన్ కోసం సాను, గౌత‌మ్ చేసిన గ్రౌండ్ వ‌ర్క్ .. స్టోరీ బోర్డ్ వంటివి గ్రేట్ అని పొగిడేశారు.

ఇది ఓ రియల్ లైఫ్ స్టోరి అని.. ఒక రంజీ ప్లేయర్ జీవితకథతో తీస్తున్నారని వార్తలొచ్చాయి కదా? అని ప్రశ్నిస్తే అర్జున్ అనే పాత్ర పూర్తిగా ఫిక్షనల్ మాత్రమేనని నాని తెలిపారు. రంజీ ప్లేయర్ కథ కానీ .. నిజజీవిత కథ కానీ కానేకాదు అని క్లియర్ కట్ గా చెప్పారు. క్రికెట్ ప‌రంగా ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో అంత డీటైలింగ్‌గా తెలుగులో వ‌చ్చిన తొలి సినిమా `జెర్సీ` అవుతుంది. సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్టు ఉంటుందని అన్నారు. ఎక్క‌డా సినిమా కోసం ఆడిన‌ట్టు ఉండ‌దు. ఈ సినిమా ప‌రంగా నాకు ప్ర‌తిదీ కొత్తే. నాకు ఇందులో క్రికెట‌ర్ అర్జున్ క‌థ చెప్ప‌డం అనేది చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. అర్జున్ అనే వాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్ష‌న‌ల్ స్టోరీయా అనే సందేహం కలిగేలా ఆ పాత్ర ఉంటుంది.. అని తెలిపారు.