Begin typing your search above and press return to search.

హిందీ జెర్సీ రిలీజ్ అప్పుడే.. డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   17 Jan 2021 9:43 AM GMT
హిందీ జెర్సీ రిలీజ్ అప్పుడే.. డేట్ ఫిక్స్!
X
తెలుగులో నాని హీరోగా వచ్చిన జెర్సీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లోనే సూపర్బ్ క్లాసిక్ మూవీగా నిలిచిందీ చిత్రం. టాలీవుడు ప్రముఖులు ఎంతో మంది ప్రశంసించారు. ఈ సూపర్ హిట్ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ ఈ హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. హిందీ వెర్షన్ ను కూడా తెలుగు ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఒరిజినల్ దే ఉంచారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.

లాక్డౌన్ ముందే మొదలైన ఈ చిత్రం.. విరామం తర్వాత మొదలై శరవేగంగా కొనసాగుతోంది. అయితే.. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై క్లారిటీ వచ్చింది. అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసిందట యూనిట్. నార్త్ లో దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి దివాళి బరిలో నిలపాలని నిర్ణయించిందట చిత్ర బృందం.

ఈ చిత్రంలో మిగిలిన పాత్రల్లో పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. హిందీ ప్రేక్షకులను కూడా తప్పకుండా అలరిస్తుందని యూనిట్ నమ్ముతోంది. అనుకున్నవన్నీ సజావుగా ముందుకు సాగితే.. దీపావళి సందర్భంగా నవంబర్ 5న ఈ మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.