Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్​ కు షాకింగ్​ న్యూస్​ చెప్పిన జెర్సీ డైరెక్టర్​..!

By:  Tupaki Desk   |   11 April 2021 7:30 AM GMT
మెగా ఫ్యాన్స్​ కు షాకింగ్​ న్యూస్​ చెప్పిన జెర్సీ డైరెక్టర్​..!
X
రాంచరణ్​ అల్లూరిగా నటించబోతున్న ఆర్​ ఆర్​ ఆర్​ సినిమా కోసం మెగా ఫ్యాన్స్​ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మరో స్టార్​ హీరో ఎన్టీఆర్​ కొమురం భీం పాత్ర చేస్తుండటం.. సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా తర్వాత చరణ్​.. సంచలన దర్శకుడు శంకర్​తో ఓ పాన్​ ఇండియా మూవీలో చేయబోతున్నట్టు ప్రకటించాడు.

అయితే ప్రస్తుతం శంకర్​ తెరకెక్కిస్తున్న ఇండియన్​ -2 మధ్యలోనే ఆగిపోయింది. ఓ వైపు ఈ సినిమా వివాదం చెలరేగుతున్నది. అసలు శంకర్​, చరణ్​ కాంబోలోని సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. ఇదిలా ఉంటే ఈ గ్యాప్​లోనే జెర్సీ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్​ గౌతమ్​ తిన్నసూరితో .. చరణ్​ ఓ సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇరువర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ సోషల్​మీడియాలో ఈ వార్తలు వైరల్​ అయ్యాయి.

తాజాగా ఈ విషయంపై గౌతమ్​ క్లారిటీ ఇచ్చాడు. ‘ప్రస్తుతం నేను జెర్సీని హిందీలో రీమేక్​ చేస్తున్నాను. ఆ పనిలో బిజీగా ఉన్నాను. ఏ తెలుగు హీరోకు ఇంతవరకు కథ చెప్పలేదు. కథలు కూడా నా వద్ద సిద్ధంగా లేవు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్​కు షాక్​ తగిలింది. జెర్సీ డైరెక్టర్​ తో చరణ్​ సినిమా ఉండబోతున్నదని వాళ్లు ఎంతో ఆశపడ్డారు. కానీ గౌతమ్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చరణ్​ ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఇక ఆర్​ఆర్​ ఆర్​ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్​, ఇటు నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.