Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్ వల్ల హీరోయిన్‌ కి వింత అనుభవం

By:  Tupaki Desk   |   5 April 2022 5:30 PM GMT
ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్ వల్ల హీరోయిన్‌ కి వింత అనుభవం
X
శ్రద్దా శ్రీనాథ్‌... ఈ పేరును తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు లో ఈమె జెర్సీ సినిమా లో నటించి మంచి పేరును దక్కించుకుంది. అంతే కాకుండా చిన్నా పెద్ద సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరును సొంతం చేసుకుంది. స్కిన్ షో కు దూరంగా ఉంటూ కేవలం ఈమె నటనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది అనేది టాక్‌. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్‌ తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించినా కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. చూడగానే చాలా మంది ఈమెను గుర్తు పడుతారు అనడంలో సందేహం లేదు. అయితే ఇండస్ట్రీ లో శ్రద్ధ లు చాలా మంది అయ్యారు. శ్రద్దా దాస్.. శ్రద్దా శ్రీనాథ్‌ మరియు శ్రద్దా కపూర్‌.. ఇంకా కొందరు ఉన్నారు. ఇంత మంది శ్రద్ద లు ఉన్న కారణంగా ఈమె కు అప్పుడప్పుడు కాస్త చిరాకు కలిగే సంఘటనలు జరుగుతున్నాయట.

తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో ఒక మహిళ తనను గుర్తు పట్టి జెర్సీ సినిమా హీరోయిన్ కదా అంటూ దగ్గరకు వచ్చి మాట్లాడిందట. ఆ సమయంలో తనను శ్రద్దా దాస్ అంటూ సంబోధించింది. అప్పుడు నేను శ్రద్దా దాస్ కాదు.. శ్రద్దా అని చెప్పాను. ఔను మీరు శ్రద్దా అని నాకు తెలుసు.. శ్రద్దా దాస్ అంటూ మరోసారి అన్నదట. అప్పుడు నేను స్పందిస్తూ నేను శ్రద్దా దాస్ ను కాదు ఆమె మరొకరు అంటూ చెప్పాను.

నేను శ్రద్దా దాస్ కాదు శ్రద్దా శ్రీనాథ్‌ అని పరిచయం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆమెకు తాను నటించిన జెర్సీ సినిమా అందులోని పాత్ర అంటే చాలా ఇష్టంగా చెప్పుకొచ్చింది. పాత్ర తో అంతగా గుర్తుంచుకోవడం ఆనందించే విషయం అనడంలో సందేహం లేదు. అంతగా గుర్తుంచుకున్నందుకు గాను ఆమె పేరు తప్పు చెప్పినా కూడా నాకు కోపం రాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

శ్రద్దా శ్రీనాథ్‌ సినిమాల విషయానికి వస్తే బ్యాక్‌ టు బ్యాక్ ఏదో ఒక భాషలో సినిమాలను చేస్తూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు లో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈమె ఒక సినిమాను కమిట్‌ అయ్యిందని తెలుస్తోంది. స్కిన్‌ షో విషయం లో ఎప్పుడు దూరంగా ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన విషయాలు చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి.