Begin typing your search above and press return to search.

జెర్సీ: రంగస్థలం.. F2 నుండి నేర్చుకున్నారా?

By:  Tupaki Desk   |   19 Feb 2019 5:05 PM GMT
జెర్సీ: రంగస్థలం.. F2 నుండి నేర్చుకున్నారా?
X
గతంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పటికో గానీ శాటిలైట్ రిలీజ్.. ఉండేది కాదు. ఏ పండక్కో పబ్బానికో కొత్త సినిమా టీవీ ప్రీమియర్లు ఉండేవి. కానీ అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. మొదట 60 రోజులన్నారు. తర్వాత 50.. 45.. స్లోగా ఆది 30 రోజులకు వచ్చింది. మెజారిటీ సినిమాలు వారానికే టపా కట్టేస్తాయి కాబట్టి నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తే వాటికొచ్చిన ఇబ్బందేమీ ఉండదు కానీ సూపర్ హిట్ అయ్యి లాంగ్ థియేట్రికల్ రన్ ఉన్నప్పుడు మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది.

'రంగస్థలం'.. 'F2' లాంటి సినిమాల విషయంలో ఇప్పటికే అలాంటి ఇబ్బంది ఎదురైంది.. తమిళంలో '96' సినిమా విషయంలో కూడా సేమ్ ప్రాబ్లమ్. దీంతో నిర్మాతలు తమ కొత్త సినిమాల డిజిటల్ రైట్స్ అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్తపడుతున్నారు. నాని కొత్త సినిమా 'జెర్సీ' నిర్మాతలు సినిమా రిలీజ్ అయిన 90 రోజులకు స్ట్రీమింగ్ చేయాలని డిజిటల్ రైట్స్ కొన్న వారితో ఒప్పందం చేసుకున్నారట. ఒకవేళ నాని విశ్వరూపం చూపించి 'జెర్సీ' సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతలకే కాకుండా బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లకు పండగే పండగ.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 5 న విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.