Begin typing your search above and press return to search.
వీడియో: ఏళ్లు గడిచినా వన్నె తరగని అందం
By: Tupaki Desk | 22 Sept 2019 10:05 AM ISTహాలీవుడ్ పాప్ దిగ్గజం జెన్నిఫర్ లోపెజ్ ఏళ్లు గడుస్తున్నా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించి ఆశ్చర్యపరుస్తోంది. ఫేమస్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఫ్యాషన్ షోలో అరటి ఆకులాంటి డ్రెస్ ని ధరించి తన ప్రౌడ అందాల్ని ప్రదర్శించి పాప్ ప్రపంచాన్నే కాకుండా ఫ్యాషన్ రంగాన్ని కూడా ఔరా అనిపించింది.
అయితే ఆ సంఘటన జరిగి ఇప్పటికి 20 ఏళ్లవుతోంది. కాలం మారింది. జెన్నీఫర్ లోపెజ్ క్రేజూ పెరిగింది. వయసూ పెరిగింది. కానీ ఆమె హాట్ నెస్ మాత్రం ఇంకా తగ్గ లేదు. 20 ఏళ్ల క్రితం రెడ్ కార్పెట్ పై ఎలా హొయలు పోయిందో అంతకు మించిన స్థాయిలో తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
మిలాన్ లో జరుగుతున్న 2020 సమ్మర్ ఫ్యాషన్ వీక్ రెడ్ కార్పేట్ పై గ్రీన్ కలర్ ఆకులాంటి డిజైనర్ డ్రెస్ లో బ్రా లెస్ ఫోజులో జెన్నీఫర్ లోపేజ్ క్యాట్ వాక్ చేసింది. 20 ఏళ్ల క్రితం ఏ స్థాయిలో తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుందో అదే స్థాయికి ఏ మాత్రం తగ్గని అందాలతో ఆకట్టుకోవడం అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. ర్యాంప్ పై జెన్నీ నడుస్తుంటే ఆమె అందాలని తమ కెమెరాల్లో బంధించాలని కిడ్స్ నుంచి వయసు మళ్లిన వాళ్లు కూడా ప్రయత్నించి నోరెళ్లబెట్టి తన్మయత్వానికి లోనయ్యారు.
ఇన్నేళ్లయినా వన్నెతరగని అందాలతో జెన్నీఫర్ లోపేజ్ మెస్మరైజ్ చేస్తోందని మురిసిపోయారు. జేలో నటించిన `హాస్ట్ లర్స్` చిత్రాన్ని మలేషియాలో బ్యాన్ చేశారు. సినిమాలో అత్యధికంగా అడల్ట్ కంటెంట్ వున్న కారణంగా ఆ చిత్రాన్ని తమ దేశంలో బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ గవర్నమెంట్ ప్రకటించింది.