Begin typing your search above and press return to search.

ఆ హాలీవుడ్ బ్యూటీ వల్లే గూగుల్ ఇమేజెస్ మొదలు

By:  Tupaki Desk   |   3 May 2019 8:59 AM GMT
ఆ హాలీవుడ్ బ్యూటీ వల్లే గూగుల్ ఇమేజెస్ మొదలు
X
గూగుల్ లేకుండా మనం అసలు ప్రపంచాన్ని ఊహించుకోగలిగే పరిస్థితిలో లేము. ప్రతిదానికి మనం గూగుల్ సెర్చ్ పై ఆధారపడడం చాలా కామన్ అయింది. అయితే గూగుల్ లో సాధారణ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా కోట్లకొద్దీ ఇమేజెస్ కూడా ఉంటాయి. గూగుల్ సెర్చ్ పేజ్ లో ఇమేజెస్ అనే ట్యాబ్ కూడా ఉంటుంది. అయితే ఈ గూగుల్ ఇమేజెస్ ను ప్రత్యేకంగా గూగుల్ వారు మొదలుపెట్టడానికి ఒక సంఘటన కారణం అయిందట.

2000 వ సంవత్సరంలో హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ లోపెజ్ గ్రామీ అవార్డు ఫంక్షన్ కు హాజరయింది. ఆమెకు ఆ కార్యక్రమంలో అవార్డు ఏమీ రాలేదు కానీ గ్రామీ అవార్డులను విజేతలకు ప్రదానం చేసేందుకు ఆ ఈవెంట్ కు హాజరయింది. అసలే ఆమె స్టన్నింగ్ బ్యూటీ.. పైగా వెర్సాచే బ్రాండ్ వారి ఒక గ్రీన్ కలర్ రివీలింగ్ డ్రెస్ వేసుకుకొని హాజరైంది. అది ఒక ఉల్లి పొర లాంటి వస్త్రం. పైనేమో పే...ద్ద వీ నెక్. కింద థై స్లిట్ ఉంది. దీంతో అందరి కళ్ళు ఆమె పైనే. ఆమెతోపాటు అవార్డు ను ప్రదానం చేయడానికి వచ్చిన మరో సెలబ్రిటీ డేవిడ్ డుకావ్నీ మాట్లాడుతూ "నేను గత ఐదేళ్ళుగా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. కానీ నేను స్టేజిపై ఉండగా ఇలా నన్ను పట్టించుకోకుండా పక్కనుండేవారినే చూడడం ఇదే మొదటి సారి" అంటూ చమత్కరించాడు.

ఈ ఈవెంట్ జరిగిన సమయంలో జెన్నిఫర్ లోపెజ్ 'ది వెడ్డింగ్ ప్లానర్' అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోందట. బిజీ షెడ్యూల్ కావడంతో గ్రామీ అవార్డు ఈవెంట్ కు సరైన డ్రెస్ ను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదట. ఈ గ్రీన్ డ్రెస్ తో పాటు మరో వైట్ డ్రెస్ మాత్రమే అందుబాటులో ఉండడంతో గ్రీన్ డ్రెస్ వేసుకుందట. కానీ ఆ డ్రెస్ సంచలనం సృష్టించింది. నెక్స్ట్ డే టాప్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నీ ఈ డ్రెస్ పై పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయట. అసలు అవార్డు విజేతలకంటే ఈ డ్రెస్ పైన వచ్చిన కథనాలే ఎక్కువట. ఇక 'జంగిల్ గ్రీన్ ప్రింటెడ్ డ్రెస్ జెన్నిఫర్ లోపెజ్' అని అదేపనిగా అప్పటి కుర్ర నెటిజనులు సెర్చ్ చేయడంతో గూగుల్ సిస్టమ్స్ క్రాష్ అయ్యేంత పని జరిగిందట. ఆ సంఘటన తర్వాత గూగుల్ వారు ఇమేజెస్ ను మొదలు పెట్టారు.

ఈ సంఘటన అంతా వివరిస్తూ ఉన్న వీడియోను జెన్నిఫర్ లోపెజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అసలు ఇలాంటి ఐడియా రావడానికి కారణమైన తనకు గూగుల్ వారు పేమెంట్ ఇవ్వలేదని సరదాగా వ్యాఖ్యానించింది. జెన్నిఫర్ వీడియో కు స్పందనగా గూగుల్ వారు ఒక జెన్నిఫర్ పేరుమీద ఒక విజిటింగ్ కార్డు ఫోటోను ట్వీట్ చేశారు. అందులో జెన్నిఫర్ లోపెజ్.. చీఫ్ ఇన్సెప్షన్ ఆఫీసర్.. గూగుల్ ఇమేజెస్ అని ఉంది. అంటే హాటు భామను ఘనంగా సత్కరించినట్టే కదా? అన్నట్టు ఇప్పుడు జె.లో వయసెంతో తెలుసా 49 ఏళ్ళు.