Begin typing your search above and press return to search.

ఆకాశానికి ఎగువ‌న‌ ఇసుకకు దిగువన పీస్..!

By:  Tupaki Desk   |   7 Feb 2021 8:00 AM IST
ఆకాశానికి ఎగువ‌న‌ ఇసుకకు దిగువన పీస్..!
X
త‌నిష్క్ జువెల‌రీ అంబాసిడ‌ర్ గా తెర‌పైకొచ్చిన ఈ భామ గుర్తుందా?టీసిరీస్ సింగిల్స్ తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌తో పాపుల‌రైన బ్రెజిలియ‌న్ మోడ‌ల్ కం న‌టి జెనిఫర్ పిక్సినాటో. స‌ల్మాన్ తో క‌లిసి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టించింది. ఇంత‌కుముందు ఓ మహియా మ్యూజిక్ వీడియో తో బాగా పాపుల‌రైంది.

జెనిఫర్ పిక్కినాటో పాపుల‌ర్ అంతర్జాతీయ మోడల్. ప్ర‌స్తుతం మ్యూజిక్ వీడియోలు.. వెబ్ సిరీస్ లలో క‌నిపిస్తోంది. బ్రెజిల్ నుండి వచ్చి ఇండియాలో హ‌వా సాగిస్తోంది. విదేశాల్లో విద్య బారో గ్రూప్ థియేటర్ కంపెనీ అండ్ స్కూల్- సెసుమార్ (ఫ్యాషన్ డిజైన్) నుంచి ఈ బ్యూటీ గ్రాట్యుయేట్. హోండా- కిట్ కాట్- అముల్ ప్ర‌‌క‌ట‌న‌ల్లో న‌టించింది. ఆదిత్య నారాయణ్ తో మెయిన్ డూబా రహూన్ మ్యూజిక్ వీడియోల్లో మెరిపించింది.

జెన్నిఫ‌ర్ తాజాగా బీచ్ ఫోటోషూట్ తో దుమారం రేపుతోంది. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఫోటోలు వీడియోలు వెబ్ లో వైర‌ల్ గా మారాయి. స‌ముద్ర‌ శంఖంతో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లోనూ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ``స్కై అబౌ.. సాండ్ బిలో.. పీస్ వితిన్.. ! `` అంటూ అదిరిపోయే క‌విత‌నే అల్లింది ఈ భామ‌. న‌టాలియా ఫోటోగ్ర‌ఫీ మోనిక మేక‌ప్ అందించారు.