Begin typing your search above and press return to search.

అందుకు సన్నీని అభినందించిన జీవిత

By:  Tupaki Desk   |   28 Oct 2017 9:26 AM GMT
అందుకు సన్నీని అభినందించిన జీవిత
X
ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్న సన్నీ లియెని వస్తే జనం ఏ రేంజ్ లో ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసే షాక్ అయ్యి ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. గతం ఎలా ఉన్నా సన్నీ మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాగే తన వ్యక్తిత్వంతో కూడా అందరిని ఆకట్టుకుంటోంది.

అయితే ప్రస్తుతం సన్నీ హీరో రాజశేఖర్ గరుడవేగ లో ఐటెమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అమ్మడు స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే రాగానే ఆమెకు మంచి వెల్కమ్ ని ఇచ్చారు. ముఖ్యంగా జీవితా రాజశేఖర్ ఆమెను చాలా గొప్పగా పొగిడేశారు. ఆమె సినీ లైఫ్ గురించి కాకుండా జీవితా సన్నీ మంచితనం గురించి కొన్ని కామెంట్స్ చేసింది.

ముఖ్యంగా సన్నీ లియోన్ ఒక అనాధ పాపను దత్తత ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మంచి పనితో నలుగురికి ఆదర్శంగా నిలిచారని జీవితా వ్యాఖ్యానించారు. అలాగే ఈ సినిమాలో భాగమైనందుకు కూడా చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఆ తర్వాత సన్నీ కూడా అదే తరహాలో జీవిత గురించి కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసింది.