Begin typing your search above and press return to search.
పవన్ పై జీవిత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 Sept 2021 10:00 AM ISTప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ సర్కార్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ సన్నివేశాన్ని మరింత రచ్చకెక్కేలా మార్చారు. పవన్ వ్యాఖ్యలపైనా..ప్రభుత్వ మంత్రుల వ్యాఖ్యలపైనా ఎవరి అభిప్రాయాల్ని వారు చెబుతున్నారు. తాజాగా ఈ వేడిలోకి జీవితా రాజశేఖర్ ఎంటర్ అయ్యారు. తన అభిప్రాయాన్ని కూడా ఆమె స్పష్టంగా వెల్లడించారు. సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. రెండింటిని ముడిపెట్టి మాట్లాడను. పవన్ కళ్యాణ్ ని హీరోగా అభిమానిస్తాం. మంచి వ్యక్తిత్వం గలవారు.. అని జీవిత అన్నారు. నిర్మాతలకు..పరిశ్రమకు సాయపడే వ్యక్తి. సినిమాల పరంగా ఆయనతో మాకు ఎలాంటి విబేధాలు లేవు. అయితే ఓ రాజకీయనాయకుడిగా ఆయన మాటలకు..పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెండింటిని పోల్చి చూడకూడదు. ఒకే వ్యక్తి సినిమాల్లో..రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ రాజకీయ వ్యాఖ్యల్ని పరిశ్రమకి ఆపాదించడం భావ్యం కాదు. పవన్ అలా అన్వయించడనే మేము భావిస్తున్నామని జీవిత తెలిపారు.
అలాగే కమెడియన్ పృథ్వీ..బండ్ల గణేష్ తనంటే భయపడుతున్నారని జీవిత అన్నారు. అందుకే తనని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని..అలా కాకపోతే `మా` లొ చాలా మంది పోటీ దారులు ఉండగా తననే ఎందుకు టార్గెట్ చేసినట్లు? అని ప్రశ్నించారు. తనంటే భయం ఉంది కాబట్టే టార్గెట్ అయ్యానని జీవిత పేర్కొన్నారు.
మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఇన్ని రకాలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలకు పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మాకు..పవన్ వ్యాఖ్యలకు సంబంధం లేదని నిర్మాతలు దిల్ రాజు..బన్నీవాస్..సునీల్ నారంగ్..మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రకటించారు. తాజాగా జీవిత వ్యాఖ్యలు ఆ దిశగానే సాగాయి. ఇప్పటికైతే ఆ నలుగురు కానీ.. ఇంకెవరూ సమర్థించనేలేదు. పవన్ ని పరిశ్రమ పూర్తిగా ఒంటరివాడిని చేసినట్లు అయింది.