Begin typing your search above and press return to search.

వర్మ వల్ల సెట్టయిన పాత హీరో

By:  Tupaki Desk   |   31 May 2018 11:33 AM IST
వర్మ వల్ల సెట్టయిన పాత హీరో
X
సినిమా ఇండస్ట్రీలో నట జీవితం ఎన్నేళ్లు సక్సెస్ ట్రాక్ లో ఉంటుందో ఎవ్వరికి తెలియదు. కాస్త పట్టు తప్పినా ఎవ్వరు పట్టించుకోరు. ఈ మాయ ప్రపంచంలో ఖర్చులు తెలియకుండానే అవుతుంటాయి. చాలా వరకు సినీ తారలు డబ్బు వేనేకేసుకోవడంలో కొంత తడబడతారు. ఆ తరువాత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవడం అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే ఒక సీనియర్ నటుడు మాత్రం ఇప్పుడు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈవెంట్స్ మేనేజర్ గా కొనసాగుతున్నాడు.

అతను ఎవరో కాదు. రామ్ గోపాల్ వర్మకు కెరీర్ స్టార్టింగ్ నుంచి అత్యంత సన్నిహితుడైన జేడీ.చక్రవర్తి. శివ నుంచి కొనసాగిన వారి స్నేహబంధంలో ఏనాడు మార్పు రాలేదు. అయితే ప్రస్తుతం జేడీ ఖాళీగా ఉన్నాడు. అందుకే కొంచెం బిజినెస్ లోకి దిగాలని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాడు. ఇక వర్మ ద్వారా ఆఫీసర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొత్తం దగ్గరుండి తీసుకున్నాడు. స్టేజ్ మీద గాని సెలబ్రెటీల మధ్య గాని మనోడు ఎక్కడా కనిపించలేదు. నాగార్జున యొక్క ఎన్. కన్వెన్షన్ లో ఈ వేడుక జరిగింది.

మొత్తం స్టేజ్ వెనకనుంచి వాకి టాకీతో తన అనుచరులతో పనులు నిర్వహించాడు. అసలు ఈ ఈవెంట్ ప్లానార్ ఎవరని కూడా అక్కడి సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ విధంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు జేడీ. ఇక మొత్తానికి రామ్ గోపాల్ వర్మ కారణంగా జేడీకి క పని దొరికింది. సినిమా రిజల్ట్ ని బట్టి సక్సెస్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉండవచ్చు. ఇక నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది.