Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ప్రొడ్యూసర్ దొరికాడు

By:  Tupaki Desk   |   25 Sept 2017 3:58 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ప్రొడ్యూసర్ దొరికాడు
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అనౌన్స్ మెంట్ సమయంలోనే సంచలనాలను సృష్టిస్తుంటాడు. ముందుగా ఓ వివాదాస్పద కామెంట్ నుం ఎంచుకోవడం.. దానిపై జనాల్లో ఆసక్తి జనరేట్ కాగానే.. నిర్మాతలను వెతుక్కోవడం.. పిక్చరైజేషన్ లోనూ కొన్ని సెన్సేషన్స్ ను క్రియేట్ చేయడం ఈయనకు అలవాటు.

శశికళ జీవితంపై సినిమా అంటూ అనౌన్స్ చేసినా.. దాని సంగతి ఇంకా తేలలేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ.. సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా చేస్తానని చెప్పడం సెన్సేషన్ అయింది. లక్ష్మీపార్వతి కోణంలోంచి ఈ చిత్రం ఉంటుందని చెప్పకనే చెప్పాడు వర్మ. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయనున్నట్లు నందమూరి బాలకృష్ణ చెప్పిన సమయంలోనే ఈ వివాదాస్పద ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించేందుకు.. వర్మ శిష్యులలో ఒకరైన.. హీరో జేడీ చక్రవర్తి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ తరఫున లక్ష్మీ పార్వతిని అప్రోచ్ అయ్యాడట జేడీ. ఆమె దగ్గర నుంచి కొన్ని ఇన్ పుట్స్ తో పాటు అనుమతులు కూడా తీసుకున్నాడని అంటున్నారు.

ఎన్టీఆర్ జీవితాన్ని ఒకసమయంలో కాపాడిన వ్యక్తిగా లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందని చెప్పాడట. అయితే.. ఎన్టీఆర్ మరణ సమయంలో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఇందులో టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఎన్టీఆర్ ను కలిసేందుకు ముందు లక్ష్మీ పార్వతి జీవితాన్ని చూపే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. ఆ కండిషన్ మేరకే ఈ చిత్రానికి తన అనుమతి ఉంటుందని తెగేసి చెప్పారట లక్ష్మీపార్వతి.