Begin typing your search above and press return to search.

జేడీ శ్రీ‌దేవిని డైరెక్ట్ చేయ‌డ‌మేంటి?

By:  Tupaki Desk   |   15 Oct 2015 6:01 AM GMT
జేడీ శ్రీ‌దేవిని డైరెక్ట్ చేయ‌డ‌మేంటి?
X
వివాదాల వ‌ర్మ ఫ్యాక్ట‌రీలో చేసే ఎటెంప్ట్స్ అసాధార‌ణ‌మైన‌వి. కాస్త బుర్ర ఉన్నోడు ఈ లోకంలో ఎలా అయినా బ‌తికేయొచ్చు అని నిరూపించిన వ‌ర్మ త‌న ఫ్యాక్ట‌రీలో ర‌క‌ర‌కాల ఆయుధాల్ని తెలివిగా ఉప‌యోగిస్తుంటాడు. టైమ్ చూసుకుని ఫ‌లానా సినిమా చేసేస్తున్నా అంటూ ప్ర‌చారం చేస్తాడు. వివాదాల‌తో కావాల్సినంత ఉచిత ప్ర‌చారం కొట్టేసి, ఆ త‌ర్వాత సైలెంటైపోతాడు.

ఇక అంద‌రూ మ‌ర్చిపోతున్నారు అనుకుంటుండ‌గానే ఆ సినిమాకి మ‌ళ్లీ ఏదో ఒక రూపంలో ప్ర‌చారం చేసుకుంటాడు. ఇలాంటి డిఫ‌రెంట్ స్ర్టాట‌జీని అనుస‌రిస్తూ సినిమాలు తెర‌కెక్కించి రిలీజ్ చేయ‌డం వ‌ర్మ‌కే తెలిసిన అరుదైన విద్య‌. ఇప్పుడు వ‌ర్మ అప్ప‌ట్లో హ‌డావుడి చేసేసిన శ్రీ‌దేవి ప్రాజెక్టు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఓ టీనేజి కుర్రాడు ఆంటీకి ఆక‌ర్షితుడైతే ఏంటి? అనే కాన్సెప్టుతో అప్ప‌ట్లో సావిత్రి అనే టైటిల్‌ని ప్ర‌క‌టించి, ఫోటోషూట్‌ల‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన వ‌ర్మ .. ఆ త‌ర్వాత మ‌హాన‌టి సావిత్రి అభిమానులు వ్య‌తిరేకించ‌డంతో టైటిల్ మార్చాడు. సావిత్రి టైటిల్ కాస్తా శ్రీ‌దేవిగా మారింది. దాంతో శ్రీ‌దేవి నుంచి, బోనీ క‌పూర్ నుంచి వార్నింగులు అందుకున్నాడు వ‌ర్మ‌.

అయినా టైటిల్ ఏమీ మార్చ‌లేదు కానీ ఆ ప్రాజెక్టును అప్ప‌టికి ప‌క్క‌న పెట్టేశాడు. ఇప్పుడు దానిని దుమ్ము దులిపి తిరిగి తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడుట‌. అయితే ఈ చిత్రానికి జేడీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వ వ‌హిస్తార‌ని స‌మాచారం. మ‌ధ్య‌లో కిర‌ణ్ అనే కుర్రాడు సైలెంటుగా కొంత సినిమాని షూట్ చేసినా .. ఇప్పుడు జేడీ లైన్‌లోకి వ‌చ్చాడ‌ని చెబుతున్నారు.. అదీ సంగ‌తి.