Begin typing your search above and press return to search.

షకీలాని తిట్టినోళ్లే.. సన్నీకి సై అన్నారేం?

By:  Tupaki Desk   |   29 Feb 2016 11:42 AM IST
షకీలాని తిట్టినోళ్లే.. సన్నీకి సై అన్నారేం?
X
ఇప్పుడు ఇండియాలో సన్నీలియోన్ కి అభిమానులతో పాటు ఆరాధించే వారు కూడా పెరిగిపోయారు. ఒకవైపు ఆమె ప్రొఫెషన్, రెండోవైపు ఆమె చెప్పిన ప్రొఫెషనల్ వాల్యూస్ తోటి నటులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. అందుకే రీసెంట్ గా కేరళలో జరిగిన వనిత అవార్డ్స్ ఫంక్షన్ కోసం సన్నీ లియోన్ ని ఆహ్వానించారు. అక్కడ జయసూర్య - శక్తిశ్రీ గోపాలన్ వంటి సెలబ్రిటీలు కూడా సన్నీతో కలిసి సెల్ఫీలు దిగారు. కానీ కేరళతో పాటు ఇదే సమాజం ఓ పదిహేనేళ్ల క్రితం షకీలాను మాత్రం దుయ్యబట్టారు.

షకీలాకి సాఫ్ట్ పోర్న్ నటి అనే గుర్తింపు ఉంది. కానీ సన్నీ మాత్రం పోర్న్ నుంచి బాలీవుడ్ సినిమాల్లోకి మళ్లింది. మరి సన్నీకి అందరూ సై అంటున్నా.. అప్పట్లో షకీలాను వ్యతిరేకించడం ఆశ్చర్యకరం. అసలు కేరళలో ఎప్పటి నుంచో అడల్డ్ కంటెంట్ మూవీల కల్చర్ ఉంది. కానీ షకీలా సమయంలో ఆమె సినిమాల దెబ్బకి స్టార్ హీరోల మూవీస్ కి కూడా ప్రేక్షకులు రావడం మానేశారు. తమ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితిలో అందరూ ఆమెను వ్యతిరేకించారు. ఇదొక కారణం అయితే.. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నంత విస్తృతంగా షకీలా సమయంలో లేదు. అప్పట్లో పోర్న్ గురించి మాట్లాడేందుకు కూడా వెనకాడే పరిస్థితి.

కానీ ఇప్పుడు పోర్న్ గురించి తెలుసుకోవడం కనీస జ్ఞానం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అందుకే అప్పటి సమాజం షకీలాని వ్యతిరేకిస్తే.. ఇప్పటి సమాజం మాత్రం సన్నీని నెత్తిన పెట్టుకుంటోంది. ఒకరకంగా అప్పట్లో షకీలాకి ఉద్దేశ్యపూర్వకంగానే ఇండస్ట్రీ అన్యాయం చేసిందని చెప్పాలి.