Begin typing your search above and press return to search.

జాకెట్ జాన‌కిరామ్ వ‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   28 Aug 2018 2:15 PM GMT
జాకెట్ జాన‌కిరామ్ వ‌చ్చేశాడు
X
సిల్లీఫెలోస్ ప్ర‌మోష‌న్ బాహుబ‌లి రేంజ్‌లో మొద‌లైంది. బాహుబ‌లి సినిమాలోని క్యారెక్ట‌ర్ల‌న్నింటినీ ఒకొక్క‌టిగా ఇంట్ర‌డ్యూస్ చేస్తూ సినిమాకి హైప్ తీసుకువ‌చ్చారు రాజ‌మౌళి. ఆ త‌ర్వాత ఆ ఫార్ములాని చాలా సినిమాలు అనుస‌రించాయి. తాజాగా `సిల్లీ ఫెలోస్` కూడా. అల్ల‌రి న‌రేష్‌ - సునీల్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. భీమ‌నేని శ్రీనివాస్ తెర‌కెక్కించారు. వ‌చ్చే నెల 7న విడుదల కాబోతోంది. ఈమ‌ధ్యే మ‌హేష్‌బాబు చేతుల‌ మీదుగా ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేయించి, ప్ర‌మోష‌న్‌ కి మ‌రింత జోరును తీసుకొచ్చింది చిత్ర‌బృందం.

అది కంటిన్యూ అయ్యేలా క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ మొద‌లుపెట్టింది. మొద‌ట జాకెట్ జాన‌కిరామ్ క్యారెక్ట‌ర్‌ ని ప‌రిచ‌యం చేశారు. ఇంత‌కీ ఈ పాత్రలో ఎవ‌రు క‌నిపిస్తారో తెలుసా? ...జ‌య‌ప్ర‌కాష్‌ రెడ్డి. జాకెట్ జాన‌కిరామ్ వృత్తి లేడీస్ టైల‌ర్ క‌మ్ ఎమ్మెల్యే. ప్ర‌వృత్తి ఏదైనా మొద‌ట్నుంచీ చెప్ప‌డం. మినిస్ట‌ర్ గారి భార్య‌కి జాకెట్లు అద‌ర‌కుట్టి, ఆవిడ రిక‌మెండేష‌న్‌ తో జెట్ స్పీడులో ఎమ్మెల్యే అయిపోయాడట‌. ఎంతెత్తుకెదిగినా గ‌తాన్ని మ‌రిచిపోకూడ‌ద‌నేది ఈయ‌న సిద్ధాంతం అంట‌. అందుకే ఎమె్మ‌లేయే ఐనాక్కూడా రోజకో జాకెట్ అయినా కుడుతుంటాడని స్ప‌ష్టం చేసింది చిత్ర‌బృందం. మ‌రి ఈ జాకెట్ జాన‌కిరామ్ మొద‌ట్నుంచీ ఏం చెప్పాడో, ఈయ‌న కుట్టే జాకెట్లు ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.