Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ తో ఆపి.. కొత్తోళ్లతో స్టార్ట్

By:  Tupaki Desk   |   19 Sept 2016 9:30 AM
పవర్ స్టార్ తో ఆపి.. కొత్తోళ్లతో స్టార్ట్
X
దర్శకుడు జయంత్ సి పరాన్జీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉంటాయి. టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి స్పీడ్ చూపించిన ఈ దర్శకుడు కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నాడు. చివరగా ఇద్దరు పవర్ స్టార్లతో సినిమాలు చేసి మరీ బ్రేక్ తీసుకోవడం విశేషం. తెలుగులో ఈయన తీసిన చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ తీశాడు. అలాగే కన్నడలో నిన్నిందలే అంటూ శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మూవీ చేశాడు.

ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలు ఆపేసిన జయంత్.. రెండేళ్ల తర్వాతమ మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు మాత్రం కొత్తవాళ్లతో మూవీ చేస్తానని చెప్పడం ఆశ్చర్యకరమే. మొత్తం అందరూ కొత్తవాళ్లను క్యాస్టింగ్ లోకి తీసుకుని.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్ ను తీయబోతున్నాడట జయంత్ సీ పరాన్జీ. ఈ చిత్రంలో నీలేష్- ఇసాబెల్ లు లీడ్ రోల్స్ పోషించనున్నారు.

ఎక్కువ భాగం ముంబైలో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశాడు దర్శకుడు. నవంబర్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.