Begin typing your search above and press return to search.

స‌ర్ధార్‌.. ఈసారి సినిమాటోగ్రాఫ‌ర్ వికెట్‌

By:  Tupaki Desk   |   14 Sep 2015 5:50 AM GMT
స‌ర్ధార్‌.. ఈసారి సినిమాటోగ్రాఫ‌ర్ వికెట్‌
X
స‌ర్ధార్‌ జీ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ రోజుకో కాంట్ర‌వ‌ర్సీతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ఎవ్రీడే న్యూస్‌ లోకొస్తోంది. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌క ముందు నుంచీ ఏదో ఒక హాట్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ని మెప్పించ‌లేక చాలా వికెట్లు మిడిల్ డ్రాప్ అవ్వ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చిందిప్పుడు. లేటెస్ట్ అప్‌ డేట్ ప్ర‌కారం ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫ‌ర్ వాకౌట్ చేశారు.

ప్రారంభం ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది రెండేళ్ల పాటు ఈ సీక్వెల్ కోసం సీరియ‌స్‌ గా క‌స‌ర‌త్తు చేశాడు. వ‌న్ ఫైన్ డే.. ప‌వ‌న్‌ తో ఏం స‌మస్య వ‌చ్చిందో, ఒప్పించ‌లేక వెనుదిరిగాడు. సంప‌త్ ప్లేస్‌ లో ప‌వ‌ర్ ఫేం బాబీని ఎంపిక చేసుకున్నాడు ప‌వ‌న్‌. అయితే ఇటీవ‌లి కాలంలో బాబి కూడా ప‌వ‌న్‌ తో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నాడ‌న్న వార్త‌లొస్తున్నాయి. లేటెస్టుగా ప‌వ‌న్‌, బాబి సినిమాటోగ్రాఫ‌ర్ విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత సినిమాటోగ్రాఫ‌ర్ విన్సెంట్ విష‌యంలో బాబి అసంతృప్తిగా ఉన్నాడు. ఆ విష‌యాన్ని బాబి ప‌వ‌న్‌ కి చెప్పాడు. అయితే విన్సెంట్ లాంటి సీనియ‌ర్ త‌న‌కి కావాల్సిన ఔట్ పుట్ ఇస్తాడ‌ని భావించిన ప‌వ‌న్ అత‌డికి స‌పోర్ట్‌ గా నిలిచాడు. చివ‌రికి ఏమైందో .. ద‌ర్శ‌కుడి మాటే నెగ్గింది. ఇప్పుడు విన్సెంట్ స్థానంలో కొత్త సినిమాటో గ్రాఫ‌ర్ వ‌స్తున్నార‌ని స‌మాచారం. మ‌రో సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ అర్థ‌ర్.ఎ.విల్స‌న్ రంగంలోకి దిగుతున్నాడ‌ని తెలుస్తోంది. విన్సెంట్‌ నాకు న‌చ్చ‌లేద‌ని బాబి అన‌డంతో అత‌డు హ‌ర్ట‌య్యాడ‌ని, అందుకే త‌నంత‌ట తానుగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప‌వ‌న్‌ కి చెప్పాడ‌ని తెలుస్తోంది.

విన్సెంట్ త‌ప్పుకుంటున్నాడు కాబ‌ట్టి .. ఇది ఇప్ప‌టికే స‌ర్ధార్‌ జీకి సంబంధించి మూడో ఛేంజ్‌. ముందు సంప‌త్‌ నంది మారాడు. ఆ త‌ర్వాత యంగ్ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్‌ ని కాజ‌ల్‌ తో రీప్లేస్ చేశారు. ఇప్పుడు విన్సెంట్‌ ని విల్స‌న్ తో రీప్లేస్ చేస్తున్నారు. ఇప్ప‌టికైతే ఇది మూడో వికెట్‌. ఇక‌నైనా ఎలాంటి ఛేంజెస్ - ఈగో క్లాషెస్ లేకుండా స‌ర్ధార్‌ జీ ముందుకు సాగాల‌ని కోరుకుందాం.