Begin typing your search above and press return to search.

అవును.. ‘జయమ్ము’ నిశ్చయమ్మే

By:  Tupaki Desk   |   29 Nov 2016 9:15 AM GMT
అవును.. ‘జయమ్ము’ నిశ్చయమ్మే
X
ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాల హవా మామూలుగా లేదు. క్షణం.. పెళ్లిచూపులు.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు అనూహ్యమైన కలెక్షన్లతో అదరగొట్టాయి. వాటి స్థాయిలో కాకపోయినా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కూడా మంచి వసూళ్లే సాధించి.. చిన్న సినిమాలకు స్ఫూర్తినిస్తోంది. ఓ కమెడియన్ టర్న్డ్ హీరో నటించిన సినిమా.. అందులోనూ ఓ కొత్త దర్శకుడు రూపొందించాడు.. అయినప్పటికీ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంచనాల్ని మించి వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.3.78 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద ఫిగరే.

విడుదలకు ముందే ‘జయమ్ము నిశ్చయమ్మురా’పై ఒక పాజిటివిటీ కనిపించింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకూ అన్నీ ప్రామిసింగ్ గా కనిపించడంతో జనాల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ఉండటంతో సినిమా స్థాయి ఏంటో చూడకుండా థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలుండటంతో అందరూ సంతృప్తిగా బయటికి వస్తున్నారు. కొంచెం స్లో అన్న కంప్లైంట్ మినహాయిస్తే.. మంచి సినిమా చూసిన సంతృప్తి ప్రేక్షకులకు మిగులుతోంది. ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి టేబుల్ ప్రాఫిట్స్ తో రిలీజ్ చేశాడు. కలెక్షన్లు చూస్తుంటే బయ్యర్లు కూడా లాభాల బాట పట్టేలా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/