Begin typing your search above and press return to search.
మహేష్ ఆవిష్కరించిన 'జయమ్మ పంచాయితీ' రిలీజ్ ట్రైలర్..!
By: Tupaki Desk | 4 May 2022 11:43 AM ISTప్రముఖ యాంకర్, టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల రీ-ఎంట్రీ మూవీ ''జయమ్మ పంచాయితీ''. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా ఈ శుక్రవారం (మే 6) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
'జయమ్మ..' నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్.. పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మరియు ఉద్వేగభరితమైన గొలుసు కట్టు గీతం మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.
థియేట్రికల్ ట్రైలర్ లో జయమ్మ తన విషయంలో న్యాయం కోసం గ్రామం మొత్తానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చూపించగా.. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ దానికి కొనసాగింపుగా ఆసక్తికరంగా సాగింది.
ట్రైలర్ లోకి వెళ్తే.. జయమ్మ తన భర్త ఆపరేషన్ కోసం డబ్బు పోగు చేసేందుకు అన్ని అవకాశాలను వెతుకుతుంది. తన కుమార్తె మెచ్యూరిటీ ఫంక్షన్ చేసి చదివింపుల రూపంలో వచ్చిన డబ్బును భర్తకు ఆపరేషన్ చేయించాలని కోరుకుంటుంది. ఆమె అనుకున్నది జరగకపోవడం నిరాశకు గురి చేసింది.
ఎదవ ప్రాణాలు పోతేపోనీలే అని భర్త అనగా.. 'చావడం సులువే కానీ.. బ్రతికి బాధ్యత తీసుకోవడమే కష్టం' అని సుమ చెప్పడం ఆకట్టుకుంటుంది. మరోవైపు గ్రామంలోని ఒక యువకుడు జయమ్మకు కుమార్తెను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె అతడికి వార్నింగ్ ఇస్తోంది.
జయమ్మ పంచాయితీ ఊరి సమస్యగా ఎలా మారింది? ఆమె సమస్యలు ఎలా పరిష్కరించుకుంది? ఆమె భర్తకు ఆపరేషన్ చేయించిందా లేదా? అనేది తెలియాలంటే విలేజ్ డ్రామాగా తెరకెక్కిన 'జయమ్మ పంచాయతీ' సినిమా చూడాల్సిందే.
రిలీజ్ ట్రైలర్ లో మంచి డ్రామా మరియు భావోద్వేగాలు ఉన్నాయి. ఇందులో జయమ్మగా సుమ తన అభినయంతో అందరి మనసులను దోచుకుంది. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేయగా.. ధను అంధ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
'జయమ్మ పంచాయితీ' చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాని నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత సుమ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సినిమా.. ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.