Begin typing your search above and press return to search.

మేకింగ్‌ వీడియో : ఏంటీ ఈ జయమ్మ పంచాయితీ

By:  Tupaki Desk   |   30 Dec 2021 11:43 AM GMT
మేకింగ్‌ వీడియో : ఏంటీ ఈ జయమ్మ పంచాయితీ
X
సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జయమ్మ పంచాయితీ' పబ్లిసిటీ పీక్స్ లో ఉంది. సుమ అంటే ఇండస్ట్రీలో దాదాపు అందరికీ గౌరవం మరియు అభిమానం అనడంలో సందేహం లేదు. ఏ ప్రీ రిలీజ్ వేడుక అయినా.. సక్సెస్ వేడుక అయినా ప్రతి కార్యక్రమంలో కూడా సుమ ఉండాల్సిందే. సుమ హోస్టింగ్‌ చేస్తేనే ఆ కార్యక్రమం భారీతనం సంతరించుకున్నట్లుగా చెప్పుకుంటారు. అలాంటి సుమ ఒక సినిమా లో నటిస్తుంది అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ప్రారంభం నుండి పబ్లిసిటీ వరకు కూడా ఎంతో మంది స్టార్స్ సుమ కోసం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. జయమ్మ పంచాయితీ సినిమా కోసం ఇప్పటికే పలువురు స్టార్స్ పబ్లిసిటీ చేయడం కోసం ముందుకు వచ్చారు. అందులో రామ్‌ చరణ్ మొదటగా వచ్చాడు.

తాజాగా జయమ్మ పంచాయితీ మేకింగ్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. మేకింగ్‌ వీడియోలో అంతా కూడా ఏంటీ ఈ పంచాయితీ అన్నట్లుగా ఫన్నీ డైలాగ్ చెప్పారు. వీడియో ఆధ్యంతో సుమ మరియు ఇతర యూనిట్‌ సభ్యుల హడావుడితో కొనసాగింది. సుమ సినిమా కదా.. చిన్న సినిమా అయ్యి ఉంటుందని భావించిన వారికి ఈ మేకింగ్ వీడియో చూస్తే ఇది చిన్న సినిమా కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. మీడియం బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ద్వారా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కు విజయ్ కుమార్‌ కలివరపు దర్శకత్వం.. స్క్రీన్‌ ప్లే.. కథ మరియు మాటలు అందించాడు. బాలగ ప్రకాష్‌ నిర్మించిన ఈ సినిమా కు కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది. ఈ సినిమా లో సుమ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పటికే చూపించారు. ఆమె పాత్ర ఏంటీ అనేది కూడా రివీల్‌ చేశారు. ఇక సినిమా చిత్రీకరణ ముగిసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్ ను విడుదల చేసి సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారనే నమ్మకంతో అంతా వెయిట్‌ చేస్తున్నారు. సుమ సినిమా కనుక ఫ్యామిలీ ఆడియన్స్ మొదలుకుని యూత్‌ మరియు మాస్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. జయమ్మ గా సక్సెస్ అయితే సుమ ఇక వెండి తెరపై కూడా వెనక్కి తిరిగి చూడకుండా దూకుడుగా దూసుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.