Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మన టార్జాన్ దిగుతున్నాడు

By:  Tupaki Desk   |   6 Feb 2017 12:51 PM IST
ఫస్ట్ లుక్: మన టార్జాన్ దిగుతున్నాడు
X
తమిళనాట జయం రవి ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. జయం మూవీ రీమేక్ తో ప్రారంభించి.. ఏడాదిన్న క్రితం తని ఒరువన్ బ్లాక్ బస్టర్ తో టాప్ గేర్ లోకి దూసుకెళ్లాడు. రీసెంట్ గా బోగన్ కోసం అరవింద్ స్వామితో కాంబినేషన్ రిపీట్ చేసినా.. తని ఒరువన్ మ్యాజిక్ ని మాత్రం రిపీట్ చేయలేకపోయాడు. అయితే.. మూవీకి మంచి కలెక్షన్సే వస్తున్నాయని.. బోగన్ మేకర్స్ అంటున్నారు.

ఇప్పుడీ హీరో కొత్త సినిమాకి ఫస్ట్ లుక్ వచ్చేసింది. వనమగన్ అంటూ ఓ డిఫరెంట్ మూవీలో చేస్తున్నట్లు గతంలోనే చెప్పాడు జయం రవి. వనమగన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో.. ఈ తరం టార్జాన్ ని ఆవిష్కరించాడు దర్శకుడు. సన్ ఆఫ్ నేచర్ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా బాగుంది. అందమైన ప్రకృతి అందాల మధ్య.. కేవలం చిన్నపాటి తోలు చర్మానికి కట్టుకున్న జయం రవి.. ఓ చెట్టు కొమ్మకు వేలాడుతూ ఈ పోస్టర్ లో మనకు దర్శనమిస్తాడు. వేట కోసం విల్లంబులు ఎలాగూ తప్పవనుకోండి.

విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. అఖిల్ తో కలిసి అఖిల్ మూవీలో ఆడిపాడిన సాయేషా సైగల్ ఈ మూవీలో హీరోయిన్. కోన ఫిలిం కార్పొరేషన్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగం కావడంతో.. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/