Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: టిక్ టిక్ టిక్ అదిరే

By:  Tupaki Desk   |   25 Nov 2017 12:45 PM GMT
ట్రైలర్ టాక్‌: టిక్ టిక్ టిక్ అదిరే
X
తమిళ హీరోలు కమర్షియల్ సినిమాలంటే ప్రయోగాలే అనే విదంగా ఫీల్ అవుతుంటారు. కథ ఎంత కొత్తగా ఉంటె అంత మంచిది అని ఏ మాత్రం స్టార్ డమ్ ని లెక్క చేయకుండా సినిమాను చేయడానికి సై అంటారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక ప్రయోగాత్మకమైన సినిమా రాబోతోంది. జయం రవి హీరోగా శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో టిక్ టిక్ టిక్ అనే ఒక సినిమా తెరకెక్కుతోంది.

ఇంతవరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూపించని విధంగా ఒక పెద్ద అద్భుతమే చూపించబోతున్నాడు దర్శకుడు. మన దేశపు ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ గా రాబోతోన్న ఆ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తోనే దర్శకుడు భారీ అంచనాలను రేపాడు అనిపిస్తోంది. అంతరిక్షంలో ఒక ఆస్టెరాయిడ్ (ఉల్క) భారత దేశాపటానికి దగ్గరగా వస్తుంటుంది. అది కరెక్ట్ గా ఇండియాకు దగ్గరగా ఉంటుంది. అది తాకితే ప్రపంచ పటంలో ఇండియా ఉండదు. దాన్ని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నమే అసలు కథ. అయితే హీరో కమర్షియల్ ఫార్మాట్ ఎంట్రీ ఇచ్చి ఎలా దాన్ని ఛేదించబోతున్నాడు అనే కాన్సెప్ట్ ఆసక్తిని రేపుతోంది. గ్రాఫిక్స్ కూడా హాలీవుడ్ లో రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా స్పెస్ ని చూపించిన విధానం చాలా బావుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అయితే ఈ టిక్ టిక్ టిక్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో గాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బావుండు అని అనిపిస్తోంది అనేది చాలామంది కోరిక.