Begin typing your search above and press return to search.

టిక్ టిక్.. టిక్ పెడతారా??

By:  Tupaki Desk   |   22 Jan 2018 11:30 PM GMT
టిక్ టిక్.. టిక్ పెడతారా??
X
కోలీవుడ్ లో ప్రయోగాలు చేసే యువ హీరోల్లో జయం రవి ఒకడు. జయం రీమేక్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవి జయం రవిగా మారిపోయాడు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోల్లా ఈ హీరో కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తన సినిమాలను డబ్ చేస్తున్నాడు గాని అంతగా హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన టిక్ టిక్ టిక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే తెలుగులో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా మీడియా సమావేశంలో పాల్గొన్న రవి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. రవి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా కూడా స్పీస్ తరహాలో రాలేదు. ఇదే మొదటి సినిమా. హాలీవుడ్ సినిమాలకు ఈ సినిమా ఏ మాత్రం తీసిపోదు. అంతే కాకుండా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ.. ఇండియాకి ఊహించని విధంగా ఒక ప్రమాదం ఏర్పడడటంలో స్పేస్ డిఫెన్స్ కాపాడటానికి ప్రయత్నిస్తుంటుంది. అందులో నేను కూడా ఒక ప్రముఖ వ్యక్తిని. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పించుకునే పాత్ర. నాకంటే ఎక్కువగా దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కష్టపడ్డారు. ఆయన టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట ఆయన నా దగ్గరికి వచ్చినపుడు కొత్త కథ స్పెస్ తరహాలో ఉంటుందని చెప్పారు. నేను ఆయన్ని నమ్మాను. కొంత మంది సాధ్యం కాదు అన్నారు. కానీ ఆయన చేసి చూపించారు.. అంటున్నాడు

ఇక సినిమాలో 80% స్పెస్ లోనే ఉంటుంది. షూటింగ్ చేసేటప్పుడుచాలా జాగ్రత్తలు తీసుకున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 5 నెలల పాటు దాదాపు 200 మంది గ్రాఫిక్స్ కోసం వర్క్ చేశారు. సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని రవి ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు హిట్టు అంటూ టిక్ పెడతారా? లెటజ్ సీ.