Begin typing your search above and press return to search.
జయలలిత బయోపిక్ తలైవి వాయిదా
By: Tupaki Desk | 10 April 2021 10:39 AM ISTసెకండ్ వేవ్ ప్రభావం సినిమా రిలీజ్ లపై పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాదిన కేసులు తీవ్రతరం అవ్వడం సౌత్ లోనూ కలవరపెడుతోంది. దీంతో కొన్నాళ్ల పాటు నగరాల్లో బంద్ కొనసాగుతోంది. కోవిడ్ ని అదుపులోకి తెచ్చే వరకూ కర్ఫ్యూలు కొనసాగే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే పలు పాన్ ఇండియా చిత్రాల్ని భారీ బడ్జెట్లతో రూపొందించిన సినిమాల్ని వాయిదాలు వేస్తున్నారు.
ఇదే కోవలో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కి వస్తున్న తలైవిని కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంతి మేటి క్లాసిక్ నాయిక జయలలిత బయోపిక్ గా చెబుతున్న తలైవి తెలుగు-తమిళం- హిందీలో అత్యంత భారీగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆశించినది జరగదు. అందుకే రిలీజ్ తేదీని వాయిదా వేశారు.
సెకండ్ వేవ్ ఊహించని పరిణామంగా మారడంతో వేసవి రిలీజ్ సాధ్యపడని పరిస్థితి ఉందని తలైవి బృందాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నిరవధిక వాయిదాని ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నాన్న ఫేం ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.