Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్ ముంబ‌యి భామ‌ల వ‌ల్లేనా?

By:  Tupaki Desk   |   7 July 2018 6:05 AM GMT
క్యాస్టింగ్ కౌచ్ ముంబ‌యి భామ‌ల వ‌ల్లేనా?
X
రెండు మూడు జ‌న‌రేష‌న్ల యూత్‌కి క‌ల‌ల దేవ‌త‌గా చెప్పే అందాల సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయ‌ని చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ కు కార‌ణ‌మ‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని కొత్త యాంగిల్ ను చూపించిన ఆమె కార‌ణంగా హాట్ హాట్ చ‌ర్చ‌కు రంగం సిద్ధ‌మైన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.

ముంబ‌యి నంచి వ‌చ్చే హీరోయిన్ల కార‌ణంగానే క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింద‌ని..గ‌తంలో ఇలాంటివి ఎవ‌రికీ తెలీవ‌ని చెప్పారు. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న‌.. క్యాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలు త‌న‌కు లేవ‌న్నారు. చిన్న‌త‌నం నుంచి తాను సినిమాల్లో ఉండ‌టంతో అవ‌కాశాల కోసం తాను ఎవ‌రినీ సంప్ర‌దించ‌లేద‌న్నారు.

క్యాస్టింగ్ కౌచ్ ముంబ‌యి నుంచి హీరోయిన్ల వ‌ల్ల‌నే వ‌స్తాయ‌ని.. అవ‌కాశాల కోసం కొంద‌రు.. టాప్ హీరోయిన్లు కావాల‌ని మ‌రికొంద‌రు రాజీ ప‌డ‌టంతో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయ‌న్నారు. మ‌రి.. దీనిపై ముంబ‌యి భామ‌లు ఏమంటారో చూడాలి.