Begin typing your search above and press return to search.

ప్చ్‌.. జయప్రద కూడా దెయ్యం కామెడీ

By:  Tupaki Desk   |   18 Jan 2016 5:06 AM GMT
ప్చ్‌.. జయప్రద కూడా దెయ్యం కామెడీ
X
ఒక నాటి అందాల నటి, ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అయిన జయప్రద కొత్త సినిమాలో నటించనుంది. మూడు భాషల్లో తెర కెక్కనున్న ఓ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. హారర్ కామెడీ జోనర్లో తీయనున్న ఈ మూవీ.. తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

నీరజ్ వాలా దర్శకత్వం వహించనున్న ఈ దెయ్యం కామెడీ సినిమాకి, టెక్నీషియన్స్ అంతా దాదాపు బాలీవుడ్ నుంచే వస్తున్నారు. అమాల్ మాలిక్ మ్యూజిక్ ఇస్తుండగా.. బాలగిరి నిర్మాణం వహించనున్నాడు. తనకు జయప్రదతో 25 ఏళ్ల నుంచి పరిచయం ఉందని, ఆమెతో మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు ప్రొడ్యూసర్. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడసలు జయప్రదని లీడ్ రోల్ లో తీసుకుని ఏం ఉద్ధరిస్తారన్నది అసలు పాయింట్.

జయప్రద మహానటి కావచ్చు కానీ.. ఇప్పుడు ఆమె టెర్మ్ కాదు. హారర్ కామెడీ విషయంలో.. చాలానే పోటీ వచ్చేస్తోంది. కామెడీ పండితే మూవీ వర్కవుట్ అవుతోంది కానీ.. వాటిలో ఈ తరం భామలు గ్లామర్ డోస్ బాగానే పంచుతున్నారు. ఒక వైపు దెయ్యం, మరోవైపు కామెడీ, ఇంకోవైపు అందాలతో విందు చేస్తుండడంతో.. సినిమాలు నడిచిపోతున్నాయి. మరి జయప్రదతోనే చేయాల్సినంతటి స్టోరీ ఏంటో అర్ధం కాని విషయం. కానీ.. ఒకవేళ ఈ మూవీ కానీ క్లిక్ అయిందంటే మాత్రం, సీనియర్ సుందరాంగులతో కూడా దెయ్యం సినిమాలు చేయడం కొత్త ట్రెండ్ అయిపోతుంది.