Begin typing your search above and press return to search.

ఈ రెండు సినిమాల ఫైట్ కన్ఫామే

By:  Tupaki Desk   |   5 July 2017 12:30 AM GMT
ఈ రెండు సినిమాల ఫైట్ కన్ఫామే
X
ఆగష్టు నెల రెండో వారం సినీ అభిమానులుకు మంచి రుచులే దొరకబోతున్నాయి. అలాగే కోళ్ళ పందేలు లాంటి పోటీ ఒకటి చూడబోతున్నారు. సంక్రాంతికి వినిపించే మాటలు ఇప్పుడు వినబడుతున్నాయి ఏంటి అనే అనుమానం వచ్చిందా? అవును ఆగష్టు నెల నుండి వరుసగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ చాలా సినిమాలలో ఒక రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి. అది కూడా రెండు మంచి టీమ్ లు పని చేసిన సినిమాలే కాబట్టి గట్టి పోటీనే ఏర్పడింది.

త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘అ ఆ’ సినిమా హీరో నితిన్ సినీ కెరియర్లోనే చెప్పుకో దగ్గ భారీ హిట్ అని చెప్పవచ్చు. అదే జోరులో నితిన్ ఒక రొమాంటిక్ లవ్ డ్రామాలో నటించేశాడు. హను రాఘవపూడి డైరక్షన్లో వస్తున్న ‘లై’ సినిమా ఆగష్టు 11 నాడు విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందే ముహర్తం ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ‘లై’ సినిమా పోస్టర్ నుండి నితిన్ గెటప్ - పాటలు అన్నీ కొత్తగా చూపించారు ‘లై’ టీమ్. దీనితో ఈ సినిమా పై బాగానే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఇదే రోజున మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్లో చేసిన ‘జయ జానకి నాయక’ విడుదల కాబోతుంది. ‘జయ జానకి నాయక’ సినిమాలో స్టార్ హీరో లేకపోయినా స్టార్ డైరెక్టర్ ఉండడంతో ఆ సినిమా విడుదలపై అందరూ ఒక కన్నేసి ఉంచారు.

నితిన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘లై’ సినిమా ఎటువంటి టైమ్ లో విడుదలైనా హిట్ కొడుతుంది అని ‘లై’ టీమ్ చాల నమ్మకంగా చెబుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు.. సరిక్రొత్త లవ్ స్టోరీ అని ఒక టాక్ ఉంది. బోయపాటి శ్రీను కాబట్టి దీనిలో ఏదో పవర్ ఉన్న కథే ఉంటుంది అని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. మరీ ఈ హీరోలు మధ్య పెద్ద పోటీ జరగనుంది ఆగష్టు 11 నాడు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో మీరు ఈ పోటీని చూసి ఎంజాయ్ చేయండి.​ ​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/