Begin typing your search above and press return to search.

బ్యాగ్రౌండ్ స్కోర్లు అదిరిపోయాయిగా..

By:  Tupaki Desk   |   1 Aug 2017 8:56 AM GMT
బ్యాగ్రౌండ్ స్కోర్లు అదిరిపోయాయిగా..
X
సోమవారం సాయంత్రం అరగంట వ్యవధిలో రెండు కొత్త సినిమాల టీజర్లు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఆ రెండూ కూడా జనాల్ని బాగానే ఆకట్టుకున్నాయి. అందులో మొదటిది ప్రెల్యూడ్ పేరుతో వచ్చిన ‘జవాన్’ సినిమా టీజర్ కాగా.. ఇంకోటి ‘యుద్ధం శరణం’ టీజర్. ఆ ప్రెల్యూడ్.. ఈ టీజర్ రెండూ కూడా షార్ప్ అండ్ స్లిక్ గా ఉండి జనాల దృష్టిని ఆకర్షించాయి. కంటెంట్.. క్వాలిటీ ఉన్న సినిమాల్లా కనిపించాయి. ఐతే వీటిలో స్టాండ్ ఔట్ గా నిలిచింది మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్లే. రెంటికీ కూడా నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకదానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తే.. ఇంకో దానికి కొత్త కుర్రాడు వర్క్ చేశాడు.

‘జవాన్’ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మధ్య తమన్ ఇంతకుముందున్నంత ఊపులో లేడు. అతను సంగీతం అందించిన సినిమాలు వరుసగా తేడా కొట్టేస్తుండటంతో నైరాశ్యంలో ఉన్నాడు. తిక్క.. విన్నర్.. గౌతమ్ నంద లాంటి సినిమాలకు తమన్ మంచి మ్యూజిక్కే ఇచ్చినా ఆ సినిమాలు నిలబడలేదు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘జవాన్’ మీదే ఉన్నాయి. టీజర్ లో ఉత్కంఠ రేకెత్తించేలా.. ఎనర్జిటిక్ ఆర్.ఆర్ తో ఆకట్టుకున్నాడు తమన్. ఇక ‘యుద్ధం శరణం’ విషయానికొస్తే.. ‘పెళ్లిచూపులు’ లాంటి క్లాస్ లవ్ స్టోరీకి చక్కటి మ్యూజిక్ అందించిన తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. తొలి సినిమాకు భిన్నంగా ఇది థ్రిల్లర్ మూవీ. ఐతే తొలి సినిమాతో పోలిస్తే భిన్నమైన జానర్ అయినా. వివేక్ సాగర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీజర్ కు నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్ ఆరంభం నుంచి చివరిదాకా ఒక టెంపో మెయింటైన్ అయ్యేలా చేయడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. ఆర్.ఆర్ కొత్తగా అనిపించడం ఇందులోని విశేషం.