Begin typing your search above and press return to search.

జాతిరత్నాలు చిట్టి.. ఇంట్రెస్టింగ్ లుక్

By:  Tupaki Desk   |   21 Jun 2022 8:30 AM GMT
జాతిరత్నాలు చిట్టి.. ఇంట్రెస్టింగ్ లుక్
X
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన టాలెస్ట్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మొదటి చూపులోనే కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో అమ్మడు చేసిన పాత్ర బాగానే క్లిక్కవడంతో ఇండస్ట్రీలో ఆమెకి మంచి క్రేజ్ దక్కింది. కుర్రాళ్ళ మనసులో చిట్టిగా నిలిచిపోయిన ఫారియా ఆ సినిమా తరువాత మళ్ళీ పెద్ద తరహాలో అవకాశాలను అందుకోలేకపోయింది.

ఇక ఈ బ్యూటీ హీరోల హైట్ ను కాస్త డామినేట్ చేస్తూ ఉండడంతో పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఓ స్టార్ హీరో కూడా హైట్ తో డామినేట్ చేస్తుందని ఆమెతో నటించలేనని అన్నాడట. గతంలో అనుష్క కూడా ఇదే తరహాలో ఇబ్బందులను ఎదుర్కొంది.

అంతే కాకుండా ఆమెకు వచ్చిన కథలు కూడా అంతగా నచ్చకపోవడంతో వెంటనే మరో సినిమా చేయలేకపోయింది. ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని డిసైడ్ అయ్యింది.

అయితే ఎవరు ఊహించని విధంగా ఫారియా ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండడం విశేషం. నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఒక సినిమా పోస్టర్ విడుదలైంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న ఈ పోస్టర్ లో ఫారియా నెమలి లాంటి అందంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. వల్లి మయిల్ అనే సిమిమాలో నటిస్తున్న ఫారియా కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది. ఇక ఫస్ట్ లుక్ తోనే ఫారియా ఎంతగానో ఆకట్టుకుంది.

చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అడ్వెంచర్ ఫిల్మ్ అని అర్ధమవుతోంది. విశాల్, విక్రమ్ వంటి తమిళ హీరోలతో విభిన్నమైన సినిమాలు చేసిన టాలెంటెడ్ తమిళ దర్శకుడు సుశీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక నేడు ఫారియా అబ్దుల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు.

మొత్తానికి పోస్టర్ లో అయితే ఫారియా చాలా అందంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. అలాగే ఈ బ్యూటీ తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నట్లు సమాచారం.