Begin typing your search above and press return to search.

'జాతిర‌త్నాలు' ఓ ఫ్లూక్ హిట్టా.. డైరెక్ట‌ర్ రిప్లై ఇదుగో!

By:  Tupaki Desk   |   3 Nov 2022 6:03 AM GMT
జాతిర‌త్నాలు ఓ ఫ్లూక్ హిట్టా.. డైరెక్ట‌ర్ రిప్లై ఇదుగో!
X
'పొట్ట‌గోడ‌' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు అనుదీప్‌కె. వి. అయితే ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే అంతులో అనుదీప్ పండించిన కామెడీ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే అత‌నికి ద‌ర్శ‌కుడిగా మ‌రో అవ‌కాశం ఇద్దామ‌నుకున్నాడ‌ట‌. అలా అనుదీప్ తో 'జాతిర‌త్నాలు' ప‌ట్టాలెక్కింది. న‌వీన్ పొలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.

వ‌సూళ్ల ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇక్క‌సారిగా అనుదీప్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యాడు. న‌వీన్ పొలిశెట్టి కెరీర్ ని మ‌లుపు తిప్పాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడుగా అనుదీప్ కు, హీరోగా న‌వీన్ పొలిశెట్టికి భారీ క్రేజ్ ల‌భించింది. ఆ క్రేజ్ కార‌ణంగానే అనుదీప్ కె. వి త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ తో సినిమా చేసే ఛాన్స్ ని ద‌క్కించుకున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ 'ప్రిన్స్‌'. త‌మిళంలో రూపొందిన ఈ మూవీని తెలుగులోనూ విడుద‌ల చేశారు.

ప్ర‌మోష‌న్స్ పెద్ద‌గా చేయ‌లేదు. అంతే కాకుండా సినిమాలో కంటెంట్ కూడా ఆక‌ట్టుకునే విధంగా లేక‌పోవ‌డం.. అదే 'జాతిర‌త్నాలు' ఫార్ములా కామెడీ సీన్లే వుండ‌టంతో ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు 'ప్రిన్స్‌' మూవీపై పెద‌వి విరిచారు. కొంత మంది ద‌ర్శ‌కుడు అనుదీప్ కె.వి పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు కూడా. అంతే కాకుండా ఇదొక లేకి కామెడీ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై ద‌ర్శ‌కుడు తాజాగా స్పందించాడు. చార్లీ చాప్లీన్ కున్న బ్రిలియ‌న్స్ నా ద‌గ్గ‌ర లేద‌న్నాడు.

అందుకే నా కున్న ప‌రిధిలో ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌కుండా న‌వ్వించే ప్ర‌యత్నం చేశాన‌న్నాడు. కొంత మంది దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఎంజాయ్ చేస్తారు.. కొంత మ‌ది నెగ‌టివ్‌గా తీసుకుంటారు. అయితే విమ‌ర్శ‌లు చేసే వారు నిర్మాణాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేస్తే మంచిద‌ని నా అభిప్రాయం. నా బ్రాండ్ కామెడీని లేకి కామెడీ అని ట్రోల్ చేయ‌డం నాకు న‌చ్చ‌లేదు. ఏ స‌న్నివేశంలో లేకి కామెడీ అనిపించిందో స్ప‌ష్టంగా కామెంట్ చేయండి. అంతే కానీ కామెంట్ చేయాలి కాబ‌ట్టి అన్న‌ట్టుగా కామెంట్ లు చేయ‌కండి ' అన్నాడు.

కొంత మంది జాతిర‌త్నాలు అదృష్ణ‌వ‌శాత్తు హిట్ అయింద‌ని అంటున్నారు. నేను అదృష్ట‌వంతుడిని అయితే మ‌రి వారు ఏమిటో కొంచెం ఆలోచించుకోవాలి. నాగ్ అశ్విన్ ల‌క్కీ లాట‌రీ వేసిన‌ట్టుగా ఈ సినిమా నిర్మించ‌లేదు. ఈ సినిమా ఓ ఫ్లూక్ హిట్ అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అది ఎలాగో వివ‌ర‌ణాత్మ‌కంగా వివ‌రించండి.. అలా కాకుండా విమ‌ర్శ‌లు చేస్తామంటే నేను ఎట్టిప‌రిస్థితుల్లోనూ బేస్ లెస్ కామెంట్ ల‌ను ప‌ట్టించుకోను.. అంగీక‌రించ‌ను కూడా.. అంటూ అనుదీప్ ట్రోల‌ర్స్ కి ఘాటుగా స‌మాధానం చెప్ప‌డం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.