Begin typing your search above and press return to search.
వీడియో: వాల్యూ లేని వజ్రాలు మన 'జాతిరత్నాలు'
By: Tupaki Desk | 19 Feb 2021 5:47 PM IST'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ''జాతిరత్నాలు''. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా.. హాస్యనటులు రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివరాత్రి స్సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన 'జాతిరత్నాలు' ట్రైలర్ మరియు 'చిట్టి నా బుల్ బుల్ చిట్టి' సాంగ్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా టైటిల్ సాంగ్ 'మన జాతిరత్నాలు' లిరికల్ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది.
'సూ సూడు హీరోలు.. ఒట్టి బుడ్డర్ ఖానులు.. వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంటుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రథన్ స్వరాలు సమకూర్చాడు. జాతిరత్నాలు నేపథ్యాన్ని తెలియజేసేలా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో ఆలపించాడు. ఈ సాంగ్ లో ముగ్గురు జాతిరత్నాలు చేసే అల్లరి మొత్తం చూడొచ్చు. ఈ చిత్రానికి సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై 'మహానటి' మేకర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
