Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: నవ్వులు పూయిస్తున్న 'జాతిరత్నాలు'
By: Tupaki Desk | 12 Feb 2021 5:00 PM IST'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి - హాస్యనటులు రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం ''జాతిరత్నాలు''. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మించాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా 'జాతిరత్నాలు' ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ లో ముగ్గురు హీరోలు సంకెళ్లతో బంధించబడి ఖైదీ నెం. 840 - 420 - 210 లుగా నడుచుకుంటూ వస్తున్నారు. 'సర్పరోషి కకే దిల్ మే తమన్నా.. సమంతా ఔర్ రష్మిక..తీనోమ్ మేరే సాత్ మే' అంటూ ప్రియదర్శి చెప్పే ఫన్నీ డైలాగ్ అలరిస్తోంది. 'మన ముగ్గురిలో ఒకరు చనిపోయినా పర్వాలేదురా.. మిగతా ఇద్దరు హ్యాపీగా ఉండాలి.. మీ ఇద్దరిలో ఆ ఒక్కరు ఎవరో డిసైడ్ చేసుకోండిరా' అంటూ నవీన్ సీరియస్ గా చెప్పే డైలాగ్ తో సినిమాలో ఏ రేంజ్ లో కామెడీ ఉండబోతుందో అర్థం అవుతోంది. మరి మన హాస్యరత్నాలు థియేటర్స్ లో ఏ రేంజ్ లో నవ్వులు పూయిస్తారో చూడాలి. ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చారు. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.