Begin typing your search above and press return to search.

రానా తో కలిసి అల్లరల్లరి చేసిన ముగ్గురు హస్య రత్నాలు..!

By:  Tupaki Desk   |   11 March 2021 7:55 AM GMT
రానా తో కలిసి అల్లరల్లరి చేసిన ముగ్గురు హస్య రత్నాలు..!
X
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ''నెం.1 యారీ'' అనే షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు మూడో సీజన్ తో ఎంటర్టైన్ చేయడానికి రానా సిద్దమయ్యారు. ఈసారి తెలుగు ఓటీటీ 'ఆహా' ఈ టాక్ షోని సమర్పిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని కూడా వదిలారు. ఫస్ట్ ఎపిసోడ్ లో రానాతో కలిసి ''జాతిరత్నాలు'' టీమ్ సందడి చేసినట్లు తెలుస్తోంది.

'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'జాతిరత్నాలు' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా రానా హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారీ' షో లో ముగ్గురు హాస్య రత్నాలు పాల్గొని అల్లరల్లరి చేసినట్లు తెలుస్తోంది. 'జాతిరత్నాలు' తో కంపేర్ చేస్తే బాహుబలి సినిమా నథింగ్ అంటూ రాహుల్ రామకృష్ణ నవ్వులు పూయించాడు. దర్శక నిర్మాత నాగ్ అశ్విన్ కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అయి ఎంజాయ్ చేసాడు. ఈ ఎపిసోడ్ మార్చి 14న రాత్రి 9 గంటలకు 'ఆహా' ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.