Begin typing your search above and press return to search.

వీకెండ్ కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద 'జాతిరత్నాలు' రికార్డుల మోత..!

By:  Tupaki Desk   |   15 March 2021 4:30 PM GMT
వీకెండ్ కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద జాతిరత్నాలు రికార్డుల మోత..!
X
మహాశివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి 'జాతిరత్నాలు' సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్‌ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే నడుస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గర ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు త‌ర్వాత వ‌సూళ్లు తగ్గుతాయని భావించిన వారి అంచనాలను పటాపంచలు చేస్తూ వ‌సూళ్ల వర్షం కురిపిస్తోంది. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ కామెడీ ఎంటర్టైన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వీకెండ్ లో కూడా జాతిరత్నాలు అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

వీకెండ్ అయ్యేలోపు 'జాతిరత్నాలు' సినిమా రూ.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు 70 శాతం వసూళ్లు తీసుకొచ్చిన ఈ చిత్రం.. మూడు నాల్గవ రోజు కూడా హౌజ్ ఫుల్స్ తో నడిచింది. నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు చూసుకుంటే నైజాం - 7.5 కోట్లు.. సీడెడ్ - 2.10 కోట్లు.. యూఏ - 2.25 కోట్లు.. గుంటూరు - 1.29 కోట్లు.. ఈస్ట్ - 1.06 కోట్లు.. వెస్ట్ - 1 కోటి.. కృష్ణ - 1.06 కోట్లు.. నెల్లూరు - 46 లక్షలతో కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 16.68 కోట్లు వసూలు చేసింది. ఇక రెస్టాప్ ఇండియా - 1.35 కోట్లు మరియు ఓవర్ సీస్ 2.25 కోట్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా మొత్తం 20.28 కోట్లు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.