Begin typing your search above and press return to search.

చెమ‌ట‌ల‌తో త‌డిసిముద్ద‌యిన చిట్టి ఫ‌రియా.. కార‌ణం?

By:  Tupaki Desk   |   13 Jun 2022 5:31 AM GMT
చెమ‌ట‌ల‌తో త‌డిసిముద్ద‌యిన చిట్టి ఫ‌రియా.. కార‌ణం?
X
న‌టించిన తొలి చిత్రంతోనే త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో మెప్పించింది ఫ‌రియా అబ్ధుల్లా. బబ్లీ గ్రేస్ ఫుల్ ఫరియా అబ్దుల్లా 'జాతి రత్నాలు'లో చిట్టి పాత్రతో హృదయాలను గెలుచుకుంది. ఆర‌డ‌గుల ఈ అందం పొడుగుకాళ్ల సుంద‌రిగానూ కుర్రాళ్ల మ‌న‌సులు దోచింది. తాజాగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తనకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ గురించి చెప్పింది.

ఫ‌రియా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా చెమ‌ట‌ల‌తో త‌డిసి ముద్ద‌య్యేంత‌గా త‌న ప్రాక్టీస్ సెష‌న్ కొన‌సాగింద‌ని ఈ ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. తనను తాను వీలైనంత బిజీగా ఉంచుకోవడానికి ఇష్టపడే ఫ‌రియా డ్యాన్స్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజాల గురించి కూడా ముచ్చ‌టించింది. మ‌న‌సు ప్రశాంతంగా ఉండటానికి డ్యాన్సుల కోసం సమయం కేటాయిస్తాన‌ని తెలిపింది. త‌న‌కు ఇష్టమైన టీవీ సిరీస్ ని అతిగా వీక్షించడం కూడా విశ్రాంతి తీసుకునే సులభమైన మార్గాలలో ఒకటి అని వెల్ల‌డించింది. త‌న‌కు కామెడీ జాన‌ర్ చాలా ఇష్టం. నేను సాధారణంగా ఆఫీస్ లేదా హౌ ఐ మెట్ యువర్ మదర్ ఎపిసోడ్ ని చూస్తాను! అని తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపింది.

ఫ‌రియాకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ మ‌మ‌కారం గురించి ఇదివ‌ర‌కే ప్రపంచానికి తెలుసు. రేయింబ‌వ‌ళ‌లు దీనికోసం ఎంతో శ్ర‌మిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇంతకుముందు వైర‌ల్ అయ్యాయి. సంగీతం అన్నా చెవి కోసుకుంటుంది ఫ‌రియా. అలాగే సంతృప్తికరమైన ఆహ్లాదకరమైన వ్యాయామం వ‌ల్ల‌ అదనపు ప్రయోజనాలను మర్చిపోకూడదు అని కూడా చెబుతుంది. మ‌న‌లో డోపమైన్ పెర‌గాలంటే.. నేనైతే సంగీతం వింటాను అని చెప్పింది. ఫ‌రియా ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ పరిశీలిస్తే.. తన స్నేహితులతో.. డ్యాన్సింగ్ వీడియోలు .. సరదా వీడియోలతో నిండి ఉంది.

చిట్టికి జంతువులంటే చాలా ఇష్టమ‌ని ఇన్ స్టా చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇంట్లో పిల్లిని పెంచ‌డం కూడా ఒత్తిడిని తగ్గించే అంశం.. పిల్లులు ముద్దుగా ఉండటాన్ని అసహ్యించుకుంటాను కానీ నేను వాటిపై నా ప్రేమ విష‌యంలో త‌గ్గ‌ను! అని చెబుతుంది స‌ర‌దాగా!

మీ చుట్టూ సరైన రకమైన వ్యక్తులు ఉంటే సగం యుద్ధం గెలిచినట్లే అని ఫారియా గట్టిగా నమ్ముతుంది. నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో పనిచేయడం చాలా ఇష్టం. హైదరాబాద్ లో అతిపెద్ద డ్యాన్స్ ఫెస్టివల్ అయిన సైఫర్ హౌర్స్.. నేను అలాంటి అద్భుతమైన కళాకారులను కలుసుకునే ప్రదేశం. జూన్ 25-26 తేదీలలో ప్రిజం క్లబ్- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో సరదాగా డ్యాన్సులు చేసేందుకు రండి అని కూడా ఆహ్వానించింది. సైఫర్ హోర్స్ 11వ ఎడిషన్ వారాంతంలో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని వెల్ల‌డించింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో అతిథి పాత్ర‌లో మెరిసిన ఫ‌రియా త‌దుప‌రి మంచు విష్ణు సినిమాలోనూ న‌టిస్తోంది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఢీ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సంప్ర‌దించార‌ని క‌థ‌నాలొచ్చాయి. విష్ణు స్వ‌యంగా ఈ టవ‌ర్ బ్యూటీని ఒప్పించార‌ట‌. ఆచితూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా తెలివైన ఎంపిక‌ల‌తో కెరీర్ ని సాగించాల‌ని ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం త‌న డ్యాన్సింగ్ యాక్టింగ్ స్కిల్స్ కి మ‌రింత ప‌దును పెడుతూ వ‌రుస‌గా క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం.