Begin typing your search above and press return to search.

#క్లీన్ Uతో `జాతి ర‌త్నాలు` న‌వ్వుల అల్ల‌ర్లు

By:  Tupaki Desk   |   9 March 2021 4:05 AM GMT
#క్లీన్ Uతో `జాతి ర‌త్నాలు` న‌వ్వుల అల్ల‌ర్లు
X
నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన `జాతి రత్నలు` మార్చి 11 న థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించడానికి వస్తున్నారు. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా సెన్సార్ బృందం నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ ద‌క్కింది. ఈ సినిమా ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్. క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌ని సెన్సార్ బృందం ప్ర‌శంసించింది.

దాదాపు 140 నిమిషాల నిడివితో ఆద్యంతం మూవీ అల‌రిస్తుంది. ముగ్గురు కామెడీ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. అన‌వ‌స‌ర అప‌హాస్యం ఎక్క‌డా క‌నిపించ‌దు. తెర నిండుగా కోలాహలం.. ద్వంద్వార్థాలు లేని పుష్క‌ల‌మైన వినోదం మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు .. టీజ‌ర్.. ట్రైల‌ర్ అన్నీ దూసుకెళ్లాయి.

ఇంత‌కుముందు ప్రీరిలీజ్ వేడ‌క సినిమాపై హైప్ పెంచింది. చిన్న బ‌డ్జెట్ చిత్రాలలో జాతి రత్నలు అతిపెద్ద హిట్ అవుతుంద‌ని మొత్తం చిత్ర‌బృందం చాలా నమ్మకంగా ఉంది. ఇదే హుషారులో జాతి రత్నలు భారీ ఓపెనింగ్స్ సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది.