Begin typing your search above and press return to search.

సాంగ్‌ టాక్‌: తేనెలోని మాధుర్యంలా..

By:  Tupaki Desk   |   18 July 2015 10:33 PM IST
సాంగ్‌ టాక్‌: తేనెలోని మాధుర్యంలా..
X
దేవీశ్రీ ప్రసాద్‌ ఈజ్‌ బ్యాక్‌ ఎగైన్‌. శ్రీమంతుడు పాటలు సూపర్భ్‌. ఇందులో రామ రామ అదుర్స్‌ అన్న టాకొచ్చింది. అలాగే ఆల్బమ్‌ లోని రెండో పాట జత కలిసె అంతే స్వీట్‌ సాంగ్‌. తేనెలోని మాధుర్యాన్ని కలగలిపి గొంతులో పోశారా అన్నంత హాయిగా ఉందీ పాట వింటుంటే. గాయనీగాయకులు సుచిత్ర, సాగర్‌ ఈ పాటను అత్యద్భుతంగా ఆలపించారు. పాటలో థీమ్‌ చాలా క్లాసిక్‌ టచ్‌తో ఉంది. అలాగే విజువల్‌ గానూ ఈ పాట చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా సింపుల్‌ కాన్సెప్టు ని హృదయాలకు హత్తుకునే లా తెరకెక్కించారు.

ఓ అందమైన అమ్మాయి, ఓ అందాల రాకుమారుడి లాంటి అబ్బాయి ఒకరికోసం ఒకరు అన్నట్టుగా విజువలైజేషన్‌లో చూపించారు. ప్రిన్స్‌ నవ్వినా అందమే, తుళ్లి పడినా అందమే. అతడికి సరిజోడుగా శ్రుతిహాసన్‌ కవ్వింత అదిరిపోయింది. శ్రుతి ఇరగబడి నవ్వే ఆ చిన్న బిట్‌ కుర్రాళ్ల గుండెల్ని చిదిమేసింది. గాజుల షాపు కాడ తలనీలాల్ని సవరిస్తున్న మహేష్‌ ని చూసి కుర్రాళ్లంతా కుళ్లుకునేలా ఉంది. విజువల్‌ గానూ ఈ పాట అంతే అందంగా ఉంది. ప్రతి ఒక్కరినీ ప్రేమ ముగ్గులోకి దించే పాట ఇది. యువతరానికి ఓ రేంజులో కిక్కిచ్చే పాట.

Video Song Teaser Link : https://www.youtube.com/watch?v=E2UZVV9qEJg