Begin typing your search above and press return to search.

ఈ సూపర్‌ హీరో ఒకప్పుడు తిండికి లేక అవస్థలు పడ్డాడట

By:  Tupaki Desk   |   12 Nov 2020 9:15 AM IST
ఈ సూపర్‌ హీరో ఒకప్పుడు తిండికి లేక అవస్థలు పడ్డాడట
X
ప్రపంచ వ్యాప్తంగా ఆక్వామ్యాన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న జాసన్‌ మొమోవా ప్రస్తుతం సూపర్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. హాలీవుడ్‌ సూపర్‌ హీరోల సినిమాల్లో ఈయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటుల జాబితాలో ఈయన చేరిపోయాడు. ప్రస్తుతం ఈయన ఆదాయం లెక్కలేనంత కాని ఒకప్పుడు కనీసం తినడానికి కూడా లేని పరిస్థితులను ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెళ్లడించి అభిమానులకు కన్నీరు తెప్పించాడు.

2012 వరకు ప్రసారం అయిన గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ టీవీ సిరీస్‌ ద్వారా జాసన్‌ మొమోవా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 11 ఎపిసోడ్‌ లు గా ప్రసారం అయిన ఆ టీవీ సిరీస్‌ ద్వారా జాసన్‌ పెద్దగా సంపాదించుకోలేక పోయాడు. గుర్తింపు వస్తున్న సమయంలోనే ఆ టీవీ సిరీస్‌ పూర్తి అవ్వడంతో అనూహ్యంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. ఆదాయంపై నమ్మకంతో అప్పులు చేసిన జాసన్‌ వాటిని తీర్చలేక భార్య మరియు ఇద్దరు పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయట. మేము తినేందుకు కూడా తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన పలు హాలీవుడ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తున్నాడు.