Begin typing your search above and press return to search.

జారు మిఠాయా : స‌న్నీ- విష్ణు దుమ్ముదులిపేశారుగా

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:52 PM GMT
జారు మిఠాయా : స‌న్నీ- విష్ణు దుమ్ముదులిపేశారుగా
X
మంచు విష్ణు న‌టించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జిన్నా`. ఈ మూవీ ద్వారా సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీని ఏవీఏ ఎంట‌ర్ టైన్ మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై డా. ఎం. మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మంచు విష్ణు హీరోగా న‌టిస్తూ నిర్మించారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో మంచు విష్ణు గాలి నాగేశ్వ‌ర‌రావుగా పెళ్లిళ్ల‌కు, ఫంక్ష‌న్ ల‌కు టెంట్ హాస్ సామాన్లు అద్దెకిచ్చే యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు.

ఇక స‌న్నీ లియోన్ తొలి సారి ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తిగా క‌నిపించ‌బోతోంది. ద‌స‌రా బ‌రిలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ చివ‌రి నిమిషంలో రిలీజ్ డేట్ విష‌యంలో వెన‌క్కి వెళ్లిన చిత్ర బృందం ఫైన‌ల్ గా అక్టోబ‌ర్ 21న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ విష‌యంలో జోరు పెంచేశారు. ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ లిరిక‌ల్ వీడియోని సోమ‌వారం విడుద‌ల చేశారు.

హీరో మంచు విష్ణు, స‌న్నీ లియోన్ లు పాల్గొన‌గా ప్రేమ్ ర‌క్షిత్ నేతృత్వంలో `జారు మిఠాయా...` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాట‌కు గ‌ణేష్ సాహిత్యం అందించ‌గా, నిర్మ‌లా రాథోడ్‌, సింహా ఆల‌పించారు. మాస్ ఆడియ‌న్స్ ని టార్గెట్ చేస్తూ అందించిన ఈ పాట ఆడియ‌న్స్ ని హుషారెత్తించేలా వుంది.

స‌న్నీ లియోన్ గ్లామ‌ర్‌, మెల్ట్ చేసే డ్యాన్స్ మూవ్స్ ఈ పాట‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. స‌న్నీతో క‌లిసి మంచు విష్ణు కూడా త‌న‌దైన స్టెప్పుల‌తో దుమ్ము దులిపేశాడు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఫుల్ మాసీవ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని రూపొందించారు.

గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్న మంచు విష్ణు ఈ మూవీతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వున్నాడు. అక్టోబ‌ర్ 21న విడుద‌ల కానున్న ఈ మూవీ ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌నుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.