Begin typing your search above and press return to search.

రంగ‌మ్మ‌త్త లాగా `ర‌క్క‌మ్మ‌`త్త ఎవ‌ర‌బ్బా!

By:  Tupaki Desk   |   1 Aug 2021 8:38 AM GMT
రంగ‌మ్మ‌త్త లాగా `ర‌క్క‌మ్మ‌`త్త ఎవ‌ర‌బ్బా!
X
`రంగ‌స్థ‌లం` సినిమాలో రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ పాట మాస్ ప్రేక్ష‌కుల్లో ఎలా దూసుకుపోయిందో తెలిసిందే. ముఖ్యంగా కుర్రాళ్ల‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ర‌క్క‌మ్మ‌త్త‌గా తెలుగు యువ‌త‌ను ఓ ఊపు ఊపేయ‌డానికి రెడీ అవుతోంది. 55 దేశాల్లో 14 భాష‌ల్లో `ర‌క్క‌మ్మ‌` గా ర‌చ్చ చేయ‌డానికి దూసుకొస్తుంది. ఇక జాక్వెలీన్ వేడెక్కించే పెర్ఫామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాస్ పాట‌ల్లో జాక్వెలీన్ ఎలివేష‌న్స్ ఏ రేంజులో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవైపు గ్లామ‌ర్ షోతో పాటు.. హాట్ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మాస్ లోకి వీజీగా దూసుకుపోగ‌ల‌దు. ఇంత‌కీ ర‌క్క‌మ్మ‌త్త అంత‌గా ర‌చ్చ చేసేది ఏ భాష‌లోనో తెలియాలంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

కిచ్చా సుదీప్ క‌థానాయ‌కుడిగా అనూప్ బండారి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ `విక్రాంత్ రోనా`. ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమా ని 3డిలో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే జాక్వెలిన్ క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ప్ర‌త్యేక పాత్ర‌తో పాటు హాట్ ఐటం పాట‌లోనూ న‌ర్తిస్తుంది. త‌న‌ పాత్ర పేరు ర‌క్క‌మ్మ‌. ఇటీవ‌లే ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్ ని కూడా యూనిట్ రిలీజ్ చేసింది. ర‌క్క‌మ్మ‌ని చాలా హాట్ గా ఎక్స్ ఫోజ్ చేసారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో సునామీలా దూసుకుపోతోంది.

ఆ ఒక్క పోస్ట‌ర్ తోనే కోట్లాది రూపాయ‌ల ప‌బ్లిసిటీ సునాయాసంగా ద‌క్కింది. జాక్వెలీన్ కు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కార‌ణంగానే అది సాధ్యమైంది. ఇన్ స్టా.. ట్విట‌ర్ స‌హా ఎఫ్.బీల్లో పోస్ట‌ర్ బాగా రీచ్ అయింది. ఆ స‌మ‌యంలో నే `ర‌క్క‌మ్మ` రోల్ పై ఆస‌క్తిక‌రంగా స్పందించి మ‌రింత‌ క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని జాక్ మంజునాథ్- శాలిని మంజునాత్ నిర్మిస్తున్నారు. మ‌రి తెలుగులో రిలీజ్ ఉంటుందా? లేదా? అన్న‌ది చూడాలి.