Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కిక్కుపాప కిరాకు భంగిమ!

By:  Tupaki Desk   |   22 May 2020 10:00 PM IST
ఫోటో స్టొరీ: కిక్కుపాప కిరాకు భంగిమ!
X
శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ హిందీ సినిమాల్లో నటించిన జాక్వెలిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ భామకు ఇన్స్టాలో 40 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఈ భామ 'సాహో' లో 'బ్యాడ్ బాయ్' పాటకు స్టెప్పులు వేయడంతో తెలుగువారికి కూడా పరిచయం అయింది. ఏదో ఒక ఇంట్రెసింగ్ అప్డేట్ తో అభిమానులను పలకరించడం జాక్ హాబీ.

ఒకవేళ జాక్వెలిన్ అలా పలకరించకపోయినా నెటిజన్లే ఏదో ఒక జాక్వెలిన్ ఫోటోను వైరల్ చేస్తూ ఆమెపై తమ అభిమానం చాటుకుంటారు. పైనున్న ఫోటో కూడా అలానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో జాక్వెలిన్ ఐస్ బ్లూ కలర్ గౌన్ ధరించి వయ్యారంగా పోజిచ్చింది.. జంబో వీ నెక్ కావడంతో నెటిజన్లకు హృదయంలో జిల్ జిల్ అనిపించేలా ఉంది. సరైన మేకప్ తో పాటుగా చక్కగా దువ్విన జుట్టు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో అందంగా ఉంది.

ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే జాక్వెలిన్ లాంటి అంతర్జాతీయ భామలకు ఎందుకు బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా వస్తాయనేది మనకు అర్థం అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాబట్టి లోకల్ భామలను డామినేట్ చేస్తూ ఆవకాశాలు సాధిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే జాక్వెలిన్ ప్రస్తుతం 'ఎటాక్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.