Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఎగ్జిబిట్ మ్యాగజైన్ పై కిక్కుపాప రచ్చ

By:  Tupaki Desk   |   27 April 2020 4:20 PM IST
ఫోటో స్టొరీ: ఎగ్జిబిట్ మ్యాగజైన్ పై కిక్కుపాప రచ్చ
X
శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలియని హిందీ సినిమా అభిమానులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ భామ 'సాహో' లో 'బ్యాడ్ బాయ్' పాటకు రచ్చగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఇన్స్టా గ్రామ్ లో 40 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మ్యాగజైన్లకు హాట్ ఫోటో షూట్లు చెయ్యడం.. కవర్ పేజీలపై మెరిసి జనాలను థ్రిల్ చెయ్యడం కూడా ఈ భామ హాబీలే. అయితే ఈమధ్య లాక్ డౌన్ కారణంగా జాక్వెలిన్ ఫోటోషూట్లు చెయ్యడం లేదని ఫ్యాన్స్ తో పాటుగా ఎగ్జిబిట్ మ్యాగజైన్ వారు కూడా ఫీలయ్యారేమో కానీ జాక్ ఫోటోను తమ ఇన్స్టా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసి ఓ పెద్ద క్యాప్షన్ ఇచ్చారు. "చూపులతో జాక్వెలిన్ చంపేస్తుందని అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువగా నిజంగా చంపుతోందా?" అంటూ ప్రశ్నించారు. జాక్వెలిన్ నటించిన 'Mrs. సీరియల్ కిల్లర్' అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ఒక సీరియల్ కిల్లర్ కు భార్యగా నటిస్తోంది జాక్వెలిన్. దాన్ని ఉద్దేశించే ఈ కామెంట్ పెట్టారు.

ఫోటో విషయానికి వస్తే ఛోళి.. లెహెంగా ధరించి ఓ ఫ్రెంచ్ విండో పక్కనే కార్పెట్ పై వయ్యారంగా కూర్చుంది. మెడలో దండ.. చక్కటి మేకప్.. ఆ హెయిర్ స్టైల్ చూస్తే ఎవరైనా జాక్ అందానికి లాక్ డౌన్ అయిపోకుండా ఉండరు. అంతర్జాతీయ మోడల్ కావడంతో జాక్వెలిన్ గ్రేస్ కూడా పీక్స్ లో ఉంది. ఇలాంటి ఫోటోలకు ఆటోమేటిక్ గా లైక్స్ ఫెస్టివల్ జరుగుతుంది కదా. అలాగే జరిగింది. దీని సంగతి పక్కన పెట్టి.. నెట్ ఫ్లిక్స్ ఉంటే ఆ సీరియల్ కిల్లర్ గారి భార్య సంగతేంటో చూసేయండి.