Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం రంగంలోకి జపాన్ ప్రజలు
By: Tupaki Desk | 13 Dec 2021 8:00 PM ISTతెలుగు సినిమా అంటే అదేంటీ? ఎక్కడా? అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తోందంటే ఆసక్తిగా యావత్ ప్రపంచం ఎదురుచూసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్, రాజమౌళిదే. `బాహుబలి` తరువాత తెలుగు సినిమా అంటే వరల్డ్ వైడ్ గా వున్న సినీ అభిమానుల్లో ప్రత్యేక శ్రద్ధ.. ఆసక్తి మొదలైంది. దీనికి తోడు మన వాళ్లు చేసే ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కడం స్టార్టయింది. ఓ సినిమా రిలీజ్ అంటే రొటీన్ ప్రెస్ మీట్ లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి తోడు తమ ప్రచారం కొత్తగా వుండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదంతా మేకర్స్.. ఆర్టిస్ట్ లు కలిసి చేసే ప్రచారం. కానీ ప్రభాస్ సినిమా కు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో టి సిరీస్ తో కలిసి యువీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
అయితే చిత్ర బృందంతో సంబంధం లేకుండా ఈ మూవీ ప్రచారం కోసం జపాన్ అభిమానులు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. `బాహుబలి`తో ప్రభాస్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరహా ఫ్యాన్ ఫాలోయింగ్ తలైవా రజనీకాంత్ కు మాత్రమే వుండేది కానీ ఆ రికార్డుని ప్రభాస్ తిరగరాసి జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. దీంతో ప్రభాస్ సినిమా వస్తోందంటే చాలు జపాన్ అభిమానులు మేకర్స్ కంటే ముందే తమ హీరో సినిమా ప్రచారాన్ని స్టార్ట్ చేసేస్తారు. ఎప్పటిలాగే `రాధేశ్యామ్` రిలీజ్ గురించి తెలుసుకున్న జపాన్ అభమానులు రంగంలోకి దిగేశారు.
సోషల్ మీడియా వేదికగా `రాధేశ్యామ్` చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలని పాడుతూ.. ఈ చిత్ర పోస్టర్ లని ఆర్ట్ చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగులో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం, అభిమానం ప్రభాస్ కు దక్కడంతో ఆయన తెలుగు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. జపాన్ కు చెందిన కొంత మంది అభిమానులు ప్రభాస్ కోసం ఇండియాకు వచ్చి ఆయనని ప్రత్యేకంగా కలుసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.