Begin typing your search above and press return to search.

జపాన్‌ లో రానా క్రేజ్‌ కు ఇదో నిదర్శణం

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:41 PM GMT
జపాన్‌ లో రానా క్రేజ్‌ కు ఇదో నిదర్శణం
X
బాహుబలి సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాహుబలి కారణంగా ప్రభాస్‌, రానాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రానా, ప్రభాస్‌ లు ఏ స్థాయిలో ప్రపంచ దేశాల్లో స్టార్‌ డంను దక్కించుకున్నారో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

నేడు ‘బాహుబలి’ స్టార్‌ రానా బర్త్‌ డే జరుపుకుంటున్న విషయం తెల్సిందే. బర్త్‌ డే సందర్బంగా రానాకు సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందాయి. ఆన్‌ లైన్‌ శుభాకాంక్షలతో పాటు జపాన్‌ నుండి రానా బర్త్‌ డే సందర్బంగా పెద్ద ఎత్తున ఉత్తరాలు మరియు బహుమానాలు కూడా వచ్చాయి. జపాన్‌ లోని రానా అభిమానులు ‘బాహుబలి’ నిర్మాణ ఆఫీస్‌ కు బహుమానాలు మరియు గిఫ్ట్‌ లను ఏకంగా 19 బాక్స్‌ ల్లో పంపించడం జరిగిందట.

నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చాడు. బాహుబలి చిత్రాన్ని జపాన్‌ లో డిస్ట్రిబ్యూట్‌ చేసిన సంస్థ ద్వారా రానాకు ఈ బహుమానాలు ఇండియాకు వచ్చాయని శోభు పేర్కొన్నాడు. ఇంత భారీగా బర్త్‌ డే శుభాకాంక్షలు మరియు బహుమానాలు రావడం షాకింగ్‌ గా ఉంది అంటూ నిర్మాత ట్వీట్‌ చేశాడు. బాహుబలి విలన్‌ భల్లాలదేవుడిని జపనీస్‌ ఏ స్థాయిలో అభిమానించారో ఈ బహుమానాలు చెప్పకనే చెబుతున్నాయి. ఆమద్య సుబ్బరాజు కు కూడా జపాన్‌ లో భారీగా స్వాగతం దక్కిన విషయం తెల్సిందే. మొత్తానికి బాహుబలి స్టార్స్‌ అందరిని జపానిస్‌ తెగ అభిమానించేస్తున్నారు.